పవన్ కళ్యాణ్ : 'రామోజీరావు'తో ఆ విషయమే చెప్పాలనుకున్నా..?

FARMANULLA SHAIK
ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఈ రోజు తెల్లవారు జామున అనారోగ్యంతో హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ఉదయం 4.50కి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాధ చాయలు అలుముకున్నాయి.కాగా ఆయకు సీని ప్రముఖులు, రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. అలానే రామోజీరావు తో తమకున్న అనుబంధం గురించి చెప్తూజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన మరణం పై ఆవేదన వ్యక్తం చేసారు.పవన్కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు తో కలిసి ఢిల్లీలో మోడీ నేత్రుత్వంలో జరిగిన మీటింగ్లో పాల్గొని ఉండగా రామోజీరావు మరణవార్త విన్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.రామోజీరావు గారి మరణవార్త విని దిగ్ర్భాంతి చెందాను.ఆయన జర్నలిజం లో ఒక మహోన్నతమైన వ్యక్తి నేడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఆయన స్థాపించిన ఈనాడు జర్నలిజం అనే స్కూలు నుండి వచ్చినవారే.ఈరోజు పత్రికా రంగానికి వేలాది మంది జర్నలిస్టులను రామోజీరావు అందించారు.అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించి ఇండస్ట్రీకి కూడా  ఎంతో సేవలు అందించారు.తెలుగు జర్నలిజం, వినోదం రంగం లో ఆయన చేసిన సేవలను పవన్కళ్యాణ్  గుర్తు చేసుకుంటున్నారు. ఆయన్ను మానసికంగా వైసీపీ ప్రభుత్వం జీవితం చివరి దశ లో బాగా ఇబ్బంది పెట్టింది.అయినా వాటన్నింటిని ఈ వయసు లో కూడా తట్టుకున్నారు.ప్రస్తుతం ఆయన్ను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు లేవు ఆ విషయమే నా ప్రమాణ స్వీకారం అయిపోయినాక కలిసి చెపుదాం అనే లోపే ఈవిధంగా జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి వారికీ అండగా నిలబడ్డారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వారి కుటుంబానికి భగవంతుడు అండగా ఉండాలన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: