భర్త మహాశయులు విజ్ఞప్తి మూవీతో అస్సలు రిస్కు తీసుకొని రవితేజ.. దీనితో ప్రూవ్ అయిందిగా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి డింపుల్ హయాతి , ఆశకా రంగనాథ్ హీరోయిన్లుగా నటించగా ... బీమ్స్ సిసిరిలీయో ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ రన్ టైం ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యూ / ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు , ఈ మూవీ 2 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.


ఇక 2 గంటల 20 నిమిషాల నిడివి అనేది ఓ మంచి క్రేజ్ ఉన్న హీరో సినిమాకు కాస్త తక్కువే అని చెప్పాలి. ఇలా ఈ మూవీ బృందం తక్కువ రన్ టైమ్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వార్తలు వస్తుండడంతో ఈ సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేందుకు మేకర్స్ పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకున్నట్లు ఉన్నారు అందుకే ఈ సినిమాను తక్కువ రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఉన్నారు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. రవితేజ నటించిన చాలా సినిమాలు ఇప్పటికే వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక చాలా మంది రవితేజ అభిమానులు రవితేజ ఈ సినిమాతో సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంటాడు అని పెద్ద ఎత్తున ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt

సంబంధిత వార్తలు: