టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బాబి కొల్లి ఒకరు. ఈయన కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరో గా వాల్టేరు వీరయ్య అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. బాబి తన తదుపరి మూవీ ని చిరంజీవి తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యం లో ఈ మూవీ చిరంజీవి కెరీయర్లో 158 వ సినిమాగా రూపొందనుండడంతో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం బాబి , చిరంజీవి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అత్యంత బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా ఈ సినిమాకు ఓ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడిని బాబి ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మెగా 158 మూవీ కి సంగీత దర్శకుడిగా ఏ ఆర్ రెహమాన్ ని తీసుకోవాలి అని బాబి ప్రయత్నాలు చేస్తున్నట్లు , అందులో భాగంగా రెహమాన్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు అన్ని ఓకే అయితే ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు ఆ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త గనుక నిజం అయితే ఈ సినిమాలపై అంచనాలు ఒక్క సారిగా తార స్థాయికి చేరిపోతాయి అని చాలా మంది భావిస్తున్నారు. కొంత కాలం క్రితం చిరంజీవి సైరా నరసింహా రెడ్డి అనే సినిమాలో హీరో గా నటించాడు. మొదట ఈ మూవీ కి రెహమాన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాకు రహమాన్ సంగీతం అందించలేదు.