రెబల్ స్టార్
ప్రభాస్ ప్రస్తుతం
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న "కల్కి 2898 ఏడి" అనే సినిమాలో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. చాలా రోజుల క్రితం ఈ
మూవీ ని ఈ సంవత్సరం మే నెలలో విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం ప్రకటించింది.
కానీ అప్పటికి ఈ
సినిమా పనులు చాలా పెండింగ్ ఉండడంతో ఈ
మూవీ ని మే నెలలో విడుదల చేయలేదు. ఇకపోతే తాజాగా ఈ
మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం
జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన
థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నైజాం ఏరియా
థియేటర్ హక్కులను తాజాగా అమ్మివేశారు.
అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రీసెంట్ గా విడుదల చేశారు. ఈ
మూవీ యొక్క నైజాం ఏరియా
థియేటర్ హక్కులను గ్లోబల్ సినిమాస్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ
సినిమా యొక్క నైజాం ఏరియా
థియేటర్ హక్కులను దక్కించుకున్న గ్లోబల్ సినిమాస్ సంస్థ ఈ
మూవీ ని నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ
మూవీ పై
ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.