"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన జీవి ప్రకాష్ కుమార్ కొత్త సినిమా..!

MADDIBOINA AJAY KUMAR
నటుడు మరియు సంగీత దర్శకుడు అయినటువంటి జీ వీ ప్రకాష్ కుమార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలకు సంగీతం అందించి గొప్ప సంగీత దర్శకుడుగా పేరును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో నటించి నటుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన "డియర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం ఏప్రిల్ 11 వ తేదీన మొదట తమిళ్ లో విడుదల అయింది.

ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఈ మూవీ తెలుగు లో విడుదల అయింది. ఇకపోతే తమిళ్ లో పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తెలుగు లో మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యింది. ఈ మూవీ తమిళ్ , తెలుగు రెండు ఇండస్ట్రీ లలో కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా తాజాగా ఈ సంస్థ వారు ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ప్రస్తుతం ఈ సినిమా తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: