టీవీ: లహరి తో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన యాంకర్ రవి..!

Divya
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న రవి.. హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించారు..కానీ సక్సెస్ కాలేకపోయారు. యాంకర్ రవి రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు.. తన యాంకరింగ్ తో చిన్న పెద్ద ఆనీ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్న రవి బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ఒక వెలుగు వెలిగారు.. అయితే ఈ మధ్యకాలంలో రవి ఏ షో లో కూడా పెద్దగా కనిపించలేదు..

ముఖ్యంగా బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు అక్కడ లహరి షేరితో తను రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం పైన క్లారిటీ ఇస్తూ.. హౌస్ లో ఉండగానే కాదు బయట వచ్చాక కూడా తామిద్దరం రిలేషన్ గురించి ఎన్నో రూమర్స్ వినిపించాయి.. ముందుగా తనకు యాంకర్ గా కంటే నటుడుగానే మంచి ఆసక్తి ఉండేదని ఆ ఇంట్రెస్ట్ తోనే ఆయన సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారట.. అలా ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని తెలియజేశారు రవి.

మొదటిసారి కొరియోగ్రాఫర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవి.. ఆ సమయంలో  తనకి పని నేర్చుకోమని నాగార్జున గారు సలహా ఇచ్చారట. అలా మొదట మాటీవీలో యాంకర్ గా పనిచేశానని తెలిపారు రవి. అలా సంథింగ్ స్పెషల్ అనే షో ద్వారా మంచి క్రేజ్ వచ్చిందని.. అందులో యాంకర్ లాస్య కాంబినేషన్లో చేసిన ప్రతి షో కూడా మంచి సక్సెస్ ఇచ్చిందని తెలిపారు.బిగ్ బాస్ షో లో వెళ్లినప్పుడు మోడల్ లహరి మంచి స్నేహితులమని అర్ధరాత్రిల వరకు కలిసి కూర్చొని చాలా క్లోజ్ గా ఉండడం వల్ల.. హౌస్ లో ఉన్నవాళ్లే చాలామంది కామెంట్స్ చేశారు.. ముఖ్యంగా తన భార్య తన భర్తడే కి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వకపోవడంతో చాలామంది మీ ఇద్దరి మధ్య ఎఫైర్ వల్లే ఆమె నిన్ను పలకరించలేదని చాలా దారుణంగా మాట్లాడారని.. అప్పుడే లహరి విషయం హైలైట్ గా మారిందని రవి చెప్పారు అయితే తామిద్దరం మంచి స్నేహితులమని బయటికి వచ్చాక కూడా క్లోజ్ గానే ఉన్నామని తెలిపారు రవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: