జగన్ గెలిస్తే ఏపీకి జరగబోయేది ఇదే.. హైదరాబాద్ ను మించి అభివృద్ధి చేస్తారా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ గెలిస్తే రాష్ట్రానికి మరింత మంచి జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏపీలో ఓటర్లు పెద్దఎత్తున ఓటుహక్కును వినియోగించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఎన్నికల ఫలితాల విషయంలో వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ తమ ఓటు బ్యాంక్ అనుకున్న వాళ్లలో ఎక్కువమంది ఓటు హక్కును వినియోగించుకోవడం ఆ పార్టీకి ప్లస్ అవుతోంది.
 
రూరల్ ప్రాంతాలలో ఎక్కువ శాతం ఓటింగ్ జరగడం, అర్బన్ ఏరియాలలో తక్కువ శాతం ఓటింగ్ జరగడం వైసీపీ గెలుపునకు నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేసామని వైసీపీ నేతలు చెబుతున్నారు. 120 స్థానాలకు మించి తమకు సీట్లు వస్తాయని కూటమి నేతలు చెబుతున్నా ఆ కామెంట్లను ప్రజలు నమ్మడం లేదు.
 
అయితే జగన్ ఈ ఎన్నికల్లో మరోసారి సీఎంగా గెలిపిస్తే వైజాగ్ ను హైదరాబాద్ ను మించి అభివృద్ధి చేసేలా పక్కా ప్రణాళికలు ఉన్నాయని సమాచారం అందుతోంది. జగన్ ఇప్పటికే అభివృద్ధి కోసం ప్రముఖ కంపెనీలతో, ప్రముఖ వ్యాపారవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని యువతకు ఎక్కువ సంఖ్యలో వైట్ కాలర్ జాబ్స్ వచ్చేలా జగన్ ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
 
కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ సరిగ్గా జరగలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గోదావరి జిల్లాల్లో సైతం కూటమికి షాకులు తగలబోతున్నాయని సమాచారం అందుతోంది. టీడీపీ బెదిరింపు ఫోన్ కాల్స్ కు పాల్పడిందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఎక్కువ సంఖ్యలో అధికారులను బెదిరించి తమకు అనుకూలంగా పని చేయాలని టీడీపీ కోరినట్టు తెలుస్తోంది. ఓటర్లలో చాలామంది ఇప్పటికీ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల సమయానికి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. వైసీపీ ఈ ఎన్నికల్లో గెలిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని జగన్ చెబుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: