జగన్ ను సీఎం చేయబోతున్న 34 లక్ష కుటుంబాలు.. వాళ్ల అండతో తిరుగులేదుగా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చివరి నెల రోజుల్లో ఏపీలో పరిస్థితి మొత్తం మారిపోయిందని భోగట్టా. వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సులువుగానే వైసీపీకి అధికారం దక్కనుందని తెలుస్తోంది. జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చిన 31 లక్షల కుటుంబాలు, వాలంటీర్ల, సచివాలయ ఉద్యోగుల కుటుంబాలు జగన్ కు పూర్తిస్థాయిలో సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది.
 
ఈ 34 లక్షల కుటుంబాల అండ జగన్ కు శ్రీరామరక్ష అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి మెజారిటీ సీట్లను వైసీపీ సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహం లేదని భోగట్టా. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడి ఉంటే జగన్ కు ఏ స్థాయిలో అనుకూల పరిస్థితులు ఉన్నాయో సులువుగా అర్థమయ్యేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
జగన్ మరోమారు సీఎం కావడం తథ్యమని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదని తెలుస్తోంది. సీఎం జగన్ కు ఎన్నికలు పూర్తైన తర్వాత గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని భోగట్టా. కూటమి ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు కూటమికి చేటు చేశాయే తప్ప మంచి చేయలేదనే సంగతి తెలిసిందే.
 
జగన్ మాట తప్పనని మడమ తిప్పనని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నానని చెబుతున్నారు. సీఎం జగన్ 100కు పైగా సీట్లలో విజయం సాధించడం తథ్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వైసీపీకి కచ్చితంగా అనుకూలంగా వస్తాయని ఆ పార్టీ నేతలు సైతం వేర్వేరు సందర్భాల్లో చెబుతున్నారు. జగన్ నమ్మకాన్ని నిజం చేసి ఫ్యాన్ ఎన్ని సీట్లలో తిరుగుతుందో చూడాల్సి ఉంది. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మాత్రమే సంక్షేమ పథకాలు సరిగ్గా అమలవుతాయని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: