ఏపీ:జూన్ 4 తర్వాత ఆ 2 పార్టీలు గల్లంతేనా..?

Pandrala Sravanthi
ఏపీలో ఎన్నికలు ముగిసాయి. గత ఆరు నెలల నుంచి సాగినటువంటి ప్రచార పర్వాలకు ఈరోజుతో తెరపడింది. 175అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన క్యాండిడేట్ల భవితవ్యం మొత్తం బ్యాలెట్ బాక్స్ లో ఉంది. ఇక వీరి భవితవ్యం బయటపడాలి అంటే జూన్ 4 దాకా వెయిట్ చేయాల్సిందే. ఇక అప్పటిదాకా  సర్వే సంస్థలు, రాజకీయ విశ్లేషకులు, ఇలా ఎవరికి నచ్చిన విధంగా వారు  రిజల్ట్ తెలియజేస్తూ ఉంటారు. గతంలో వారు చెప్పిన రిజల్ట్ క్లియర్ గా ఉండేది కానీ, ప్రస్తుత కాలంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి వారు చెప్పిన రిజల్ట్ క్లియర్ గా ఉండడం లేదు. ఎందుకంటే జననాడి తెలుసుకోవడం ప్రస్తుత కాలంలో కష్టమైపోతుంది. 

జనాలు అన్ని పార్టీలకు సపోర్ట్ చేసినట్టే ఉంటున్నారు, కానీ ఏ పార్టీకి ఓటు వేస్తున్నారనేది వారి మదిలోనే పెట్టుకుంటున్నారు. అలాంటి ఈ తరుణంలో  మనం ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అనేది తెలియాలంటే జూన్ 4 దాకా వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ అధికారంలో ఉంది. మరో మారు  కూడా అధికారంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేయాలని జగన్ ఎదురు చూస్తున్నారు. ఇదే తరుణంలో టిడిపి కూటమి  జనసేన బిజెపితో జతకట్టి అధికారంలోకి రావడానికి తహతహలాడుతోంది. ఇలా రెండు పార్టీల మధ్య విపరీతమైన పోరు ఏర్పడింది. ఇదే తరుణంలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఓడిపోతే మాత్రం ఇక వారి భవిష్యత్తు ఉండదని, అందులో ఒక పార్టీ మాత్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అంటున్నారు.

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జనసేన. ఒకవేళ టిడిపి అధికారంలోకి రాకుంటే,  పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతే మాత్రం జనసేన పార్టీ పరిస్థితి నీళ్లు లేని బావిలో దూకినట్టే అవుతుంది. ఇక నెక్స్ట్ ఎన్నికల వరకు ఈ పార్టీ మనుగడ పూర్తిగా లేకుండా పోతుంది. అలాగే టిడిపి పరిస్థితి కూడా మరింత దిగజారుతుంది. వైసిపి, టిడిపిని పూర్తిగా తొక్కేయాలని ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ జూన్ 4 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే ఈ రెండు పార్టీల రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమే అని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి జనసేన ఓడిపోతే వారు తప్పక ప్రతిపక్షంలో ఉండి పోరాడుతారు. కానీ టిడిపి మళ్ళీ ఓడిపోతే మాత్రం పవన్ కళ్యాణ్ ను, మరోవైపు చంద్రబాబును  నామరూపాలు లేకుండా చేస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: