హైకోర్టు తీర్పుతో పిన్నెల్లి లెక్క మార్చేస్తారా.. వాళ్ల జాతకాలను బయట పెట్టనున్నారా?

Reddy P Rajasekhar
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు తీర్పుతో ఊరట దక్కింది. జూన్ నెల 6వ తేదీ వరకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. మాచర్లలోని ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన విషయంలో పిన్నెల్లిపై కేసు నమోదైంది. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలో ఉన్నారని సమాచారం అందుతోంది.
 
అయితే హైకోర్టు తీర్పుతో పిన్నెల్లి అజ్ఞాతం వీడి బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తన ప్రవర్తన వెనుక అసలు నిజాలను చెప్పడంతో కొంతమంది జాతకాలను, అసలు రంగును బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. హైకోర్టు తీర్పు టీడీపీ నేతలకు మాత్రం ఒక విధంగా షాకేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేయడం గమనార్హం.
 
సంఘటన మే నెల 13వ తేదీన జరిగితే ఎఫ్.ఐ.ఆర్ ను 15వ తేదీన రిజిష్టర్ చేశారని లోకేశ్ షేర్ చేసిన  వీడియోను చూసి ఈసీ చర్యలు తీసుకుందని లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మొదట గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని పేర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. వీడియో మార్ఫింగ్ చేసే ఛాన్స్ కూడా ఉందని లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు.
 
ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే కేసు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని నిరంజన్ రెడ్డి కోరగా కోర్టు అంగీకరించడం గమనార్హం. పిన్నెల్లితో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ విషయంలో సైతం ఇవే నిబంధనలను పాటించాలని హైకోర్టు పేర్కొంది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి, వైసీపీ పెద్దారెడ్డిలకు హైకోర్టు తీర్పుతో ఊరట దక్కిందనే చెప్పాలి. మాచర్ల ఘటనకు సంబంధించి ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: