బంగాలదుంప తొక్కని పడేస్తే ఎన్నో ఆరోగ్య లాభాలు కోల్పోతారు?

Purushottham Vinay
బంగాలదుంప తొక్క
ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఈ పొట్టును తీసుకుంటే శరీరంలో వాపులు తగ్గుతాయి. దీంతో ఆర్థరైటిస్‌, కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక ఈ పొట్టును తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. షుగర్ అదుపులోకి వస్తుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక ఇకపై ఆలుగడ్డలను తినేటప్పుడు పొట్టుతో సహా తినండి. కావాలంటే వాటిని శుభ్రంగా కడగండి. అంతేకానీ పొట్టును తీసి పడేయకండి. దీన్ని వదులుకుంటే ఎన్నో లాభాలను కోల్పోతారు. కాబట్టి ఆలుగడ్డల పొట్టును విడిచిపెట్టకుండా తినండి. దీంతో అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.బంగాల దుంప పొట్టులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ వర్గానికి చెందుతుంది. అందువల్ల ఇది కొలెస్ట్రాల్ లెవల్స్‌ను, షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. 


బంగాలదుంప తొక్క
లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్‌, కెరోటినాయిడ్స్‌, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికర ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.బంగాళాదుంపల పొట్టులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది. ఈ పొట్టులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. అందువల్ల ఈ పొట్టు హైబీపీ ఉన్నవారికి వరమనే చెప్పవచ్చు. ఇక ఈ పొట్టులో ఉండే పొటాషియం ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేస్తుంది. కండరాలు, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు సహాయం చేస్తుంది.బంగాళాదుంపల పొట్టు మీద అంతా మట్టి, దుమ్ము ఉంటాయి కనుక పొట్టును తప్పనిసరిగా తీసేయాల్సి వస్తుంది. అయితే వాస్తవానికి బంగాళాదుంపలను పొట్టుతో సహా తినాలి. అందుకే పొట్టుని పడేయకుండా శుభ్రంగా కడిగి తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: