బాబోరికి 2019ను మించిన ఘోర ఓటమా.. సీట్లు గెలిచినా ఫలితం శూన్యమా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిని మళ్లీ గెలిపించాలని చంద్రబాబు బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అమలు సాధ్యం కాని హామీలు అని తెలిసినా పదుల సంఖ్యలో హామీలను చంద్రబాబు ప్రకటించారు. ఏడు పదుల వయస్సులో కూడా శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించి జగన్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది.
 
ఈ ఎన్నికల్లో వేర్వేరు కారణాల వల్ల చంద్రబాబుకు గతంతో పోల్చి చూస్తే మెరుగైన ఫలితాలే వస్తాయి. అయితే సీట్లు గెలిచినా ఫలితం శూన్యమే అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టికెట్లు దక్కకపోవడం వల్ల చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి టికెట్లు ఆశించిన వాళ్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం జరిగింది. కూటమికి చాలా నియోజకవర్గాల్లో పోటాపోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని తెలుస్తోంది.
 
ఈ ఎన్నికల్లో కూటమి ఓటమిపాలైతే మాత్రం కూటమి నేతలు అధికార పార్టీలోకి జంప్ కావడం ఖాయమని ఈ విధంగా బాబోరికి 2019ను మించిన ఘోర ఓటమి ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏపీలో ఓటర్లు తుది తీర్పు ఇచ్చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ ఒక్కడే ప్రచారం చేస్తూ వచ్చిన అన్ని సమస్యలను అధిగమిస్తూ ఒక్కో మెట్టు పైకి ఎక్కేశారు.
 
ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ వన్ మ్యాన్ ఆర్మీలా నిలిచారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, వృద్ధులు బారులు తీరడంతో జగన్ కు మరోసారి అనుకూల పరిస్థితులు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పోటాపోటీ ఉండదని వార్ వన్ సైడ్ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ప్రజల తీర్పు ఏకపక్షంగానే ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ శాతం పెరగడం ఏ పార్టీకి కలిసొస్తుందనే ప్రశ్నకు వైసీపీనే అని సమాధానం వినిపిస్తోంది. 100కు పైగా స్థానాలలో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు రానున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: