జనాలు అల్లాడిపోతుంటే.. ఐపీఎల్ మ్యాచ్ లే ముఖ్యమయ్యాయా?

praveen
అందరూ ఎదురుచూస్తున్న ఆట మొదలైంది  ఇక టైటిల్ వేటలో పది జట్లు బిజీ కాబోతున్నాయి. ఇక దాదాపు నెలపాటు ఇండియా మొత్తం ఎక్కడ చూసినా క్రికెట్ సంబరాలే కనిపించబోతున్నాయి. ఇక తమ అభిమాన జట్టును మద్దతు పలికి టైటిల్ విజేతగా నిలిపేందుకు అందరు క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందేందుకు  క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా రెడీ అవుతున్నారు అన్న విషయం తెలిసిందే. కాగా దేశంలోని 10 వేదికలపై ఈ ఐపీఎల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి.

 అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఐపిఎల్ మ్యాచ్ల నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకు బీసీసీఐ ఎంతో వ్యూహాత్మకంగానే టోర్ని నిర్వహణ పనులు చూసుకుంటుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు బెంగళూరులో మ్యాచులు నిర్వహిస్తారా లేదా అనే విషయంపై గత కొంతకాలం నుంచి సందిగ్ధత నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి బెంగళూరులో నీటి ఎద్దడి కారణంగా ఎంతటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా అక్కడ ప్రజలు ఎండాకాలంలో కూడా వారానికి ఒక్కరోజు మాత్రమే స్నానం చేసి సరిపెట్టుకుంటున్న పరిస్థితి. కనీసం టాయిలెట్ వాడటానికి నీళ్లు లేని దుస్థితి అక్కడ నెలకొంది.

 ఇలా తీవ్రమైన నీటి అద్దడి కారణంగా అక్కడి ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇక బెంగళూరులోని  స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్లను ఇక మరో స్టేడియం లోకి మార్చే అవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ విషయంపై కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని వేస్ట్ వాటర్ ప్లాంట్ నుంచి చిన్నస్వామి స్టేడియం కు నీటి సరఫరా చేయనుంది. ఇక మ్యాచ్ జరిగే రోజు సగటున 75000 లీటర్ల నీరు అవసరమట. దీనిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు జనాలు నీటి కొరతతో ఇబ్బంది పడుతుంటే.. ఇక్కడ మొండి పట్టు మరి మ్యాచ్ లు నిర్వహించాల్సిన అవసరం ఏముంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: