మొదటి టీ20కి ముందు.. ఆఫ్గాన్ జట్టుకి బిగ్ షాక్?

praveen
ప్రస్తుతం వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనను కూడా ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ ఆడింది టీం ఇండియా. అయితే ఇక ఇప్పుడు భారత పర్యటనకు వచ్చిన ఆప్ఘనిస్తాన్ జట్టుతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టి20 సిరీస్ టీమ్ ఇండియాకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఎందుకంటే దాదాపు 14 నెలల గ్యాప్ తర్వాత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మళ్లీ టి20 ఫార్మాట్లో క్రికెట్ ఆడెందుకు సిద్ధమయ్యారు.

 ఇక చాలా నెలల తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టి20 ఫార్మాట్లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతుంది భారత జట్టు. అయితే ఇప్పటికే ఇక ఆఫ్గనిస్తాన్ జట్టు టీమ్ ఇండియాకు చేరుకుని ప్రాక్టీస్ లో మునిగి తేలింది అని చెప్పాలి. ఇక నేటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ టీమిండియా మధ్య మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 7 గంటలకు ఇక ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది అని చెప్పాలి. అయితే మొదటి టీ20 మ్యాచ్ కి ముందే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఊహించని భారీ షాక్ తగిలింది అన్నది తెలుస్తోంది. ఎందుకంటే జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న రషీద్ ఖాన్  జట్టుకు దూరమయ్యాడు.

 ఇక ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ గా ఉన్న ఇబ్రహీం జాద్రాన్ అధికారికంగా ప్రకటించాడు అని చెప్పాలి. అయితే రషీద్ ఖాన్ పూర్తిగా ఫిట్టుగా లేడు అన్న విషయాన్ని ఇబ్రహీం జాద్రాన్ వెల్లడించారు. ఇక ఈ టి20 సిరీస్ లో అతడిని మిస్ అవుతాం. రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ లేకుండా ఆడటం అంత సులువైన విషయమేమీ కాదు. కానీ అన్ని పరిస్థితులకు మేము సిద్ధంగా ఉండాలి అంటూ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్  తెలిపారు. కాగా గత ఏడాది నవంబర్లో సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్ ప్రస్తుతం కోరుకుంటున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: