"ఆ ఒక్కటి అడక్కు" లో అల్లరి నరేష్ నటన గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన పరియా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి కామెడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన అల్లరి సినిమాతో కెరీర్ ను మొదలు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక అప్పటి నుండి ఈయన తన కెరియర్ లో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాల్లోనే నటిస్తూ వచ్చాడు. అందులోనే ఈయనకు ఎక్కువ విజయాలు దక్కుతూ ఉండడంతో చాలా సంవత్సరాల పాటు అలాగే కెరియర్ కొనసాగించాడు. ఇకపోతే ఈయన సుడిగాడు అనే సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

ఈ సినిమా తర్వాత ఈయన నటించిన ఏ కామెడీ ఓరియంటెడ్ మూవీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈయన కామెడీ సినిమాలలో కాకుండా వైవిధ్యమైన పాత్రలలో నటించడానికి ఆసక్తిని చూపించాడు. అందులో భాగంగా నటించిన నాంది మూవీ సూపర్ సక్సెస్ అయింది. దానితో ఈయన ఆ తర్వాత నుండి ఎక్కువ అలాంటి సినిమాల్లోనే నటిస్తూ వచ్చాడు. తాజాగా ఈయన ఆ ఒక్కటి అడక్కు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ ని మే 3 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో పరియ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమె మాట్లాడుతూ ... అల్లరి నరేష్ చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఆయన కామెడీ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కామెడీ టైమింగ్ లో మాత్రం ఏ మాత్రం గ్యాప్ రాలేదు. ఈ మూవీ లో ఆయన తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాడు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: