అత్యంత ఖరీదైన చిత్రంగా "రామాయణం" ఎన్ని కోట్ల ఖర్చో తెలుసా..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యంత ఖరీదైన చిత్రాలు తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం ఏ సినిమా అయినా 100 లేదా 200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది అంటే దాన్ని భారీ బడ్జెట్ చిత్రంగా సినీ ప్రముఖులు పేర్కొనేవారు . కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు మామూలు హీరోల సినిమాలు కూడా 100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నాయి. దానికి ప్రధాన కారణం బాహుబలి సినిమానే అని చెప్పవచ్చు . ఎందుకు అంటే సినిమా కథలో కంటెంట్ ఉండే దానిని భారీ ఖర్చుతో అత్యంత అద్భుతంగా చూపెట్టినట్లు అయితే భారీ అలాంటి మూవీ కి ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదు అని , సినిమా అవలీలగా దానిని వెనక్కు తీసుకు రాగలుగుతుంది అని బాహుబలి సినిమా నిరూపించింది.

దానితో ఎంతో మంది మేకర్స్ సినిమా కథలో దమ్ముంటే ఎంత ఖర్చు పెట్టడానికే అయినా రెడీ అంటున్నారు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే రామాయణం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రన్బీర్ కపూర్ , సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటిస్తూ ఉండగా ... యాష్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ ని 835 కోట్ల భారీ వ్యయంతో రూపొందించబోతున్నట్లు సమాచారం. ఇలా అత్యంత భారీ బడ్జెట్ తో రామాయణం మూవీ ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై ప్రస్తుతానికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ మంచి టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే భారీ కలెక్షన్ లను వసూలు చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rk

సంబంధిత వార్తలు: