రోహిత్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన గంగూలీ..!

Pulgam Srinivas
ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు కలిగిన క్రికెట్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకరు . ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడి ఇండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు . అలాగే కొన్ని సంవత్సరాలుగా ఇండియా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ తన అద్భుతమైన ఆట తీరుతో అలాగే తన నేతృత్వంలో ఇండియా జట్టుకు ఎన్నో విజయాలను అందించడం మాత్రమే కాకుండా ఎన్నో ట్రోఫీలను కూడా అందించాడు. ఈయన ఐ పీ ఎల్ మ్యాచ్ లలో కూడా అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తూ ఉండేవాడు.

కానీ ఈ సీజన్ లో మాత్రం రోహిత్ చాలా పేలవమైన ఆట తీరును ఐపీఎల్ మ్యాచ్ల్ లో ప్రదర్శిస్తున్నాడు. ఇక ప్రస్తుతం రోహిత్ "ముంబై ఇండియన్స్" జట్టు లో ఆడుతున్నాడు. ఈయన గతంలో కూడా ఈ జట్టుకే ఆడాడు. కాకపోతే చాలా సంవత్సరాలుగా ఈ జట్టు కి కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ ఈ సారి మాత్రం కెప్టెన్ గా వ్యవహరించడం లేదు. ఇకపోతే ఐపిఎల్ జట్టులో ముంబై ఇండియన్స్ జట్టు కూడా భారీగా ఫెయిల్ అయింది. దానితో ఇప్పటి వరకు ఈ జట్టు 13 మ్యాచులు ఆడి అందులో కేవలం నాలుగింటిలో గెలుపొంది తొమ్మిది మ్యాచ్ లలో ఓడిపోయి ఎనిమిదో పాయింట్లతో పాయింట్లు పట్టికలో 9 వ స్థానంలో కొనసాగుతుంది.

అలాగే రోహిత్ శర్మ ఆట తీరు కూడా మెరుగ్గా లేకపోవడంతో మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే టి 20 వరల్డ్ కప్ లో రోహిత్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ను ఇస్తాడా అని ఎంతో మంది అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో గంగోలి ఏ మాత్రం టెన్షన్ పడొద్దు. రోహిత్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే వరల్డ్ కప్ టి 20 లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తాడు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: