గీతా భగత్: అందం,అభినయంతో ఆకట్టుకుంటున్న స్టార్ యాంకర్!

Purushottham Vinay
ప్రస్తుతం యాంకర్లు బాగా హైలైట్ అవుతున్నారు. ముఖ్యంగా మన టాలీవుడ్ యాంకర్లు అయితే వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని రక్తికట్టిస్తూనే ప్రతి ఈవెంట్ కి ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారే రేంజ్‌కు వచ్చారు. హీరోలు, హీరోయిన్ల లాగానే వారికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుత టాలీవుడ్ యాంకర్లు కూడా స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు. ఇంకొందరు యాంకర్లు అయితే హీరోయిన్లను మించి హాట్ ఫోటో షూట్‌లతో హీట్ పుట్టిస్తూ రెచ్చిపోతున్నారు. కానీ మరికొందరు యాంకర్లు మాత్రం స్కిన్ షోకు దూరంగా పద్ధతిగా , కట్టుబొట్టుతో కార్యక్రమాన్ని ఎంతో హుందాగా నడిపిస్తుంటారు. సుమ, ఝాన్సీ వంటి వారు నిండైన రూపంతో తమ మాటలతోనే ఎదుటివారిని ఎంతగానో ఆకట్టుకుంటూ యాంకరింగ్ చేస్తూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. అసలు వీళ్ళు అయితే ఎలాంటి స్కిన్ షో చేయకుండా ఇలా కూడా యాంకరింగ్ తో ఆకట్టుకోవచ్చా అనేలా ఆలోచింపచేస్తూ వుంటారు. అలా ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. 


ఇక ఇప్పుడున్న యంగ్ యాంకర్లలో ఈ జాబితాలోకే వస్తారు గీతా భగత్. కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి దాకా ఆమె ఎక్కడా కూడా హద్దులు దాటింది లేదు. మూవీ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ఇలా సందర్భం ఏదైనా నిండైన వస్త్రధారణతోనే పద్దతిగా ఆకట్టుకుంటారు. సమయస్పూర్తితో పాటు అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆకట్టుకునే ప్రాసలతో మెప్పిస్తుంది ఈ యాంకర్. నటీ నటులని నొప్పించే విధంగా ప్రశ్నలు అడగకుండానే  అసలు విషయాన్ని రాబట్టడంలో గీతా భగత్ దిట్ట. అలా ఎంతోమంది సెలబ్రెటీల ప్రశంసలు పొందారు గీతా. యాంకరింగ్‌లోకి ప్రవేశించాలనుకునే వారికి కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు ఈమె. తన పన తాను చూసుకోవడం, సంబంధం లేని విషయాల జోలికి వెళ్లకపోవడం ఆమె ప్రత్యేకత. ప్రస్తుతం ఎంత మంది యంగ్ అండ్ హాట్ యాంకర్లు పోటీగా ఉన్నా వారిలా హాట్ షో చెయ్యకుండా ఎలాంటి ఓవర్ యాక్షన్ చేయకుండా చాలా సింపుల్ గా ఉంటూ తన మాటలతో ఎంతో ఆకట్టుకుంటారు గీతా. తాజాగా ఆమె కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. ఎంతో పధ్ధతిగా తెలుగింటి ఆడపడుచు లాగా గీతా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ యాంకర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: