AP Elections 2024: రాయలసీమదే హవా.. కలిసొచ్చేది ఎవరికంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని నిన్నటి రోజున అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ పూర్తయింది.. ముఖ్యంగా రాయలసీమలోని ఓటింగ్ శాతం భారీగా పెరిగినట్టుగా తెలుస్తోంది.గతంలో కంటే అధిక శాతం నమోదైనట్లుగా సమాచారం. ముఖ్యంగా మహిళలు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరినట్లుగా తెలుస్తోంది. యువత కూడా ఓటు హక్కును వినియోగించేకుందేందుకే ఎక్కువ ఉత్సాహం చూపించారు.. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కంటే ఎక్కువగా ఇతర ప్రాంతాలలోనే పోలింగ్ నమోదయింది. గత పోలింగ్తో పోలిస్తే ఈసారి రాయలసీమ ప్రాంతంలో ఓటింగ్ బాగానే జరిగినట్లు కనిపిస్తోంది.

రాయలసీమలో అత్యధికంగా అన్ని జిల్లాలలో పోలిస్తే సత్యసాయి జిల్లాలో 82.77 శాతం ఓటింగ్ నమోదు అయింది. అత్యంత తక్కువగా కర్నూలు జిల్లాలో 75.83 శాతం నమోదైనట్లుగా ఈసీ నిన్నటి రోజున తెలియజేస్తోంది. కడప జిల్లాలో 78.72 శాతం.. నంద్యాలలో 80.92 శాతం.. అనంతపురం 79.25 తిరుపతి 76.5 శాతం.. చిత్తూరు 82.65 శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. మొత్తం రాయలసీమ ఓవరాల్ గా పరిశీలిస్తే మాత్రం..79.53 శాతం నమోదైనట్లుగా తెలుస్తోంది అయితే ఇదంతా కేవలం నిన్నటి సాయంత్రం 6 గంటల వరకు నమోదైన పోలింగ్ మాత్రమే..

ఇక అర్ధరాత్రి వరకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును సైతం వినియోగించుకున్నట్లు తెలుస్తోంది ఆ ఓటింగ్ శాతం పైన ఈసీ ఇంకా అధికారిక ఏ విషయాన్ని ప్రకటించలేదు.. ఒకవేళ దానిని కలుపుకుంటే దాదాపుగా 80% పైగా పోలింగ్ అయినట్లుగా అంచనా వేస్తున్నారు.. ఈ పెరిగిన పోలింగ్ అధికార పార్టీ వైసీపీకే అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు దిమా చేస్తున్నారు.. గతంలో లాగానే ఈసారి కూడా మహిళలు అత్యధికంగా ఓటు వేయడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన వారే ఇలా వేశారని భావన వినిపిస్తోంది. మరి ఈ విషయం పైన రాజకీయ వర్గాలలో చాలా జోరుగానే చర్చలు జరుగుతున్నాయి. మరి తుది ఫలితాలు తెలియాలి అంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: