రాయలసీమ: కడపలో చరిత్ర సృష్టించిన మహిళ.. ఏకంగా 30 ఏళ్ల తర్వాత..!

Divya
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవలే ఎన్నికలు పూర్తి అయ్యి  ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ముఖ్యంగా వైసిపి పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది కూటమి 164 స్థానాలలో భారీ విజయాన్ని అందుకుంది. వైయస్ కుటుంబానికి కడప అంటే కంచుకోట అని ఎన్నో దశాబ్దాలుగా పేర్కొంది. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికలలో మైనార్టీలను కాదని మొదటిసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని సైతం గెలిపించారు. దాదాపుగా 35 ఏళ్లుగా ఇక్కడ మైనార్టీలదే ఎక్కువగా హవా కనిపిస్తూ ఉండేది.కానీ ఈసారి వారిని కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ అభ్యర్థిని గెలిపించి ఒకసారి కొత్త చరిత్రను కడప ఓటర్లు సైతం తిరగరాశారు.

కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత వైసిపి పార్టీ అధిష్టానాన్ని కొనసాగిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు మొదటిసారి మహిళ అభ్యర్థి ఇక్కడ గెలిచి ఒక చరిత్రను సైతం సృష్టించారు. టిడిపి అభ్యర్థి బల్లిలో నిలిచిన రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ఏకంగా 18 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచింది. ఇప్పటివరకు అన్ని పార్టీలు ఈ సీటు మైనార్టీలకు ఎక్కువగా కేటాయించాయి. కేవలం అప్పుడప్పుడు టిడిపి పార్టీ మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్టు ఇస్తూ వస్తూ ఉండేది కానీ అక్కడ గెలుపు మాత్రం వచ్చేది కాదట.

కానీ ఈసారి టిడిపి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంతో పాటు మహిళా సీట్ కేటాయించడంతో పూర్తిగా అక్కడ రాజకీయాలు మారిపోయాయి.. దాదాపుగా 70000 పై చీలుకు మైనార్టీ ఓట్లు ఉన్నప్పటికీ 35 ఏళ్లుగా మైనారిటీలదే అక్కడ ఆధిపత్యం.. ఇప్పుడు ఏకంగా అలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా మాధవి రెడ్డి వైపు నిలిచారు మైనార్టీలు ఇలా కడప నియోజవర్గంలోనే ఒక చరిత్రలో మిగిలిన మహిళగా మాధవి రెడ్డి పేరు సంపాదించింది. ప్రస్తుతం ఈ విషయం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: