ఆ సినిమా హిట్ అవుతే పూజ హెగ్డే ను అందుకోవడం కష్టమేనా..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి పూజ హెగ్డే , నాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఇందులో పూజా తన నటనతో , అందాల తో ప్రేక్షకులను కట్టి పడేయడం తో ఈమెకు వరుసగా తెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి .

అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజాయలను అందుకోవడం , ఇక మంచి విజయాలు అందుకొని సినిమాలలో కూడా ఈమె తన గ్రామర్ షో తో ప్రేక్షకులను కట్టి పడేయడం తో ఈమె అతి తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది .  ఇక తెలుగు తో పాటు హిందీ , తమిళ సినిమాలపై కూడా ఈ నటి ఫోకస్ పెట్టింది. అక్కడ కూడా ఈమె తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది .

ఇక ఈ మధ్య కాలంలో మాత్రం ఈమెకు వరుసగా అపజయాలు దక్కుతున్నాయి. దానితో ఈమెకు సినిమా అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి. అలాంటి సమయం లోనే ఈ బ్యూటీ కి సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్ అవకాశం వచ్చింది. సూపర్ క్రేజ్ కలిగిన సూర్య హీరోగా , అంతే గుర్తింపు కలిగిన కార్తీక్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే మళ్ళీ పూజ హెగ్డే తిరిగి ఫామ్ లోకి రావడం , అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం ఖాయం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: