అర్జున్ సర్జా ఇంట మొదలైన పెళ్లి సందడి..!

Pulgam Srinivas
సీనియర్ నటుడు అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమాల ద్వారా కెరీర్ ను మొదలు పెట్టిన ఈయన ఆ తర్వాత అనేక తెలుగు సినిమాలలో కూడా నటించాడు. అందులో భాగంగా ఈయన అటు కోలీవుడ్ , ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లలో కూడా ఎన్నో సినిమాలలో హీరో గా నటించి అద్భుతమైన జోష్ లో కెరీర్ ను చాలా సంవత్సరాలు కొనసాగించాడు.
 

ఇక ఈయన తెలుగు లో నటించిన కొన్ని సినిమాలు కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఈయనకు ఆ తర్వాతే కాలంలో హీరో గా అవకాశాలు తగ్గడంతో ఈయన సినిమాల్లో కీలక పాత్రల్లో , ఇతర ముఖ్య పాత్రలో నటిస్తూ కెరీర్ ను ముందుకు సాగించాడు. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈయన వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇక కాసేపు అర్జున్ సినిమాల విషయాన్ని పక్కన పెడితే ... తాజాగా ఈ సీనియర్ నటుడు ఇంట పెళ్లి సందడి మొదలు అయింది.

అసలు విషయం లోకి వెళితే ... అర్జున్ కుమార్తె అయినటువంటి ఐశ్వర్య ఈ నెల 10 వ తేదీన పెళ్లి పీటలు ఎక్కడుంది. ఇక ఈ నెల 10 వ తేదీ న పెళ్లి జరగనున్న నేపథ్యం లో ఇప్పటి నుండే వీరి ఇంట్లో పెళ్లి సందడి మొదలు అయింది. ఈ పెళ్లి సంబరాల్లో భాగంగా ఇవాళ హాల్ది వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. వైట్ అండ్ ఎల్లో కలర్ దీమ్ డ్రెస్ లలో అర్జున్ కుటుంబ సభ్యులు సందడి చేశారు. ఇకపోతే తమిళ నటుడు అయినటువంటి ఉమాపతి రామయ్య ను ఐశ్వర్య పెళ్లాడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: