కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఓటిటి ఫ్లాట్ ఫామ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
కేంద్ర ప్రభుత్వం కూడా ఓ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంస్కృతి మరియు మన భారత దేశ సంస్కృతి తెలిపే విధంగా ఉండే కంటెంట్ ను ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఇందులోని కంటెంట్ ఉండబోతున్నట్లు , అలాగే విద్యకు సంబంధించిన కంటెంట్ కూడా ఇందులో అందుబాటులో ఉంచబోతున్నట్లు ఇలా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే కంటెంట్ ను కేంద్ర ప్రభుత్వం ఓ టీ టీ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు , ఈ ఓ టి టి యొక్క కంటెంట్ ను ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చి ఆ తర్వాత డబ్బులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో సరికొత్త కంటెంట్ ఇవ్వడానికి ఎంతగానో పోటీ పడ్డాయి. అందులో భాగంగా కొన్ని ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఫుల్ గా సక్సెస్ కూడా అయ్యాయి . ఇక మరికొన్ని రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఒక ఓ టి టి ప్లాట్ ఫామ్ ను విడుదల చేయబోతున్నట్లు అందులో కూడా అద్భుతమైన కంటెంట్ ఉండబోతున్నట్లు వార్తలు బయటకు రావడంతో ప్రస్తుతం ఓ టీ టీ ప్లాట్ ఫామ్ ఎక్కువ కంటెంట్ వీక్షిస్తున్న జనాలు అంతా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోయే ఓ టి టి ప్లాట్ ఫామ్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు . మరి కేంద్ర ప్రభుత్వం ఓ టి టి ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఎలాంటి కంటెంట్ ను తీసుకు వస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott

సంబంధిత వార్తలు: