ఏపీ: అవినాష్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన షర్మిల..??

Suma Kallamadi
కడప లోక్‌సభ స్థానం నుంచి ఎవరు గెలుపొందుతారు అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా ఆసక్తికరంగా మారింది. దీనికి ముఖ్య కారణం అక్కడ వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవడమే. వైసీపీ నుంచి ఇక్కడ అవినాష్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేశారు. వీరిద్దరూ అక్కాతమ్ముళ్ల అవుతారు. అయితే షర్మిల కుటుంబం నుంచి విడిపోయి సొంత వారినే ఓడించాలని చూస్తున్నారు. అవినాష్ కు వివేకానంద హత్యకేసులో ప్రమేయం ఉందని ఆమె కడప అంతటా తిరుగుతూ చాలా రోజుల ప్రచారం చేశారు. అతన్ని ఓడించడమే తన లక్ష్యమని అన్నారు.
ఆమె సొంత అన్నయ్య జగన్ మాత్రం అవినాష్ రెడ్డికే సపోర్ట్ చేశారు. అవినాష్ రెడ్డి ఏ పాపం ఎరుగడని చెప్పుకొచ్చారు. కడప ప్రజలు చాలా రాజకీయ అవగాహన కలిగి ఉన్న వారిని, వారికి ఏది నిజమో ఏది అబద్దమో తెలుస్తుందని జగన్ పేర్కొన్నారు. షర్మిల అవినాష్ రెడ్డి ఓట్లను ఏ విధంగానూ ప్రభావితం చేయరని చాలామంది అనుకున్నారు కానీ నిన్న ముగిసిన పోలింగ్ తర్వాత ఈ భావన తప్పు అని తెలుస్తోంది. ఓటింగ్ సరళిని పరిశీలించాక కడపలో కొంత క్రాస్ ఓటింగ్ జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ క్రాస్ ఓటింగ్ కారణంగా షర్మిల గెలిచే ఛాన్స్ ఉందా అంటే కాదనే సమాధానం వినిపిస్తుంది. కాకపోతే అవినాష్ ఓట్లను చీల్చగలిగారని వినికిడి.
రెండు నుంచి మూడు శాతం వరకు ముస్లిం ఓట్ల షర్మిల కారణంగానో లేదంటే కాంగ్రెస్ పై ప్రేమతోనే పడి ఉండవచ్చు. కడప పార్లమెంటు పరిధిలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో షర్మిలకే ఓటు వేయాలని టీడీపీ నేతలు సైతం కోరినట్లు ప్రచారం జరిగింది. అవినాష్ రెడ్డిని ఓడించాలని ఉద్దేశంతోనే షర్మిలకు టీడీపీ వారు సపోర్ట్ చేశారట. అవినాష్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా పడిన ఓట్లు, క్రాస్ వోటింగ్ కారణంగా పడిన ఓట్ల వల్ల షర్మిల అద్భుతమైన మెజారిటీతో గెలుస్తారని కాదు. ఆమె గెలుపు అంచుల వద్దకు కూడా రాకపోవచ్చు. అవినాష్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ కొంత అలజడి మాత్రం ఆమె సృష్టించగలిగారు. పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లో కూడా క్రాస్ ఓటింగ్ వెలుగు చూసిందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: