2025లో తక్కువ బడ్జెట్లో రూపొంది బాక్సాఫీస్ ను షేక్ చేసిన టాప్ 5 మూవీస్ ఇవే..?

Pulgam Srinivas
ఈ సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు విజయాలను సాధిస్తే , మరికొన్ని మూవీలు అపజయాలను అందుకున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే అత్యంత తక్కువ బడ్జెట్లో రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించి భారీ స్థాయిలో లాభాలను అందుకున్నాయి. అలా ఈ సంవత్సరం విడుదల అయ్యి భారీ లాభాలను అందుకున్న 5 తెలుగు మూవీలు ఏవి అనేది తెలుసుకుందాం.

విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. ఈ సినిమాను కేవలం 50 కోట్ల బడ్జెట్లో రూపొందించారు. 

ఇక ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏకంగా 303 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఈ సంవత్సరం సొంతం చేసుకుంది. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మీరాయ్ సినిమా 50 కోట్లతో రూపొంది 154 కోట్ల కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టి ఈ సంవత్సరం భారీ లాభాలను అందుకున్న సినిమాల లిస్టు లో చేరిపోయింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన కోర్టు సినిమా 8 కోట్ల బడ్జెట్ తో రూపొంది 56 కోట్ల కలెక్షన్లను రాబట్టి అదిరిపోయే రేంజ్ లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. లిటిల్ హాట్స్ మూవీ ని కేవలం 3 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 23 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని , అదిరిపోయే లాభాలను అందుకుంది. రాజీవ్ వెడ్స్ రంబాయి మూవీ ని కేవలం 2.5 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమా 15 కోట్ల కలెక్షన్లను రాబట్టి సూపర్ సాలిడ్ లాభాలను అందుకుంది. ఇలా ఈ సంవత్సరం ఈ ఐదు సినిమాలు తక్కువ బడ్జెట్ తో రూపొంది అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేసిన సినిమాల లిస్టులో చేరిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: