ఏ దేశానికి సంబంధించినటువంటి లెక్కలు ఆ దేశానికి సపరేట్ గా ఉండే ఉంటాయి. అయితే ఇందులో స్పష్టత రావాల్సింది ఏంటంటే ఎవరు ఎంతవరకు ఏ మేరకు అనే అంశం.. అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతదేశపు ఆర్థిక వృద్ధి. అలాగే ప్రపంచపు ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది అనేది ముఖ్యమైన అంశం.దీనికి సంబంధించినంత వరకు తాజాగా చూసుకుంటే ప్రపంచంలో చైనా కంటే కూడా భారతదేశం వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుంది అనే లెక్కని గోల్డ్ మాన్ సాచ్స్ రిపోర్ట్ ద్వారా బయటపడింది. చైనా వృద్ధిరేటు ఈ ఫైనాన్షియర్ ఏడాదిలో ఇప్పటికే 9 నెలలు ముగిసిపోయింది.మరో మూడు నెలలు మాత్రమే ఉంది.
చైనా వృద్ధిరేటు దాదాపు 5 శాతం మాత్రమే ఉంటే భారతదేశ వృద్ధి రేటు దాదాపు 7.6 శాతంగా ఉందని గోల్డ్ మాన్ సాచ్స్ రిపోర్ట్ అంచనా వేసింది. గోల్డ్ మాన్ సాచ్స్ యొక్క గ్లోబల్ ఎకనామిక్స్ అనలిస్టు రిపోర్ట్ మ్యాక్రో అవుట్ లుక్ 2026 ప్రకారం 2026 లో ప్రపంచ ఆర్థిక అభివృద్ధి పటిష్టంగా కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవనుందట. ఈ నివేదిక ప్రకారం స్థిరమైన ద్రవయోల్బణం మరియు అనేక ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్య పరిస్థితులు సులభతరం కావడం వల్ల 2026లో ప్రపంచ వృద్ధి 2.8 శాతంగా ఉంటుందని అంచనా వేయబడింది.
గోల్డ్ మాన్ సాచ్స్ భారతదేశం యొక్క వాస్తవ జీడీపీ వృద్ధిని 2026లో దాదాపు 6.7% మరియు 2027లో 6.8 శాతంగా అంచనా వేసింది. అలా భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవనుంది. ఇక చైనా 2026లో 4.8 శాతం మరియు 2027లో 4.7% వృద్ధి చెందుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశం వృద్ధిరేటులో చైనా కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.