పండుగ వేళ ఘోర బస్సు ప్రమాదం..ఏకంగా 17 మంది సజీవదహనం..!
ప్రైవేట్ ట్రావెల్ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ కి వెళ్తూ ఉండగా హైవే పైన ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ బస్సులో సుమారుగా 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. బస్సు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది , అధికారులకు సమాచారం తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ బస్సును ఢీ కొట్టిన తర్వాతే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యింది.
ఈ బస్సు ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులకు గాయాలవ్వడంతో వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మరి కొంతమంది పరిస్థితి విషయంగానే ఉందని ఇప్పటివరకు 17 మంది మృతి చెందగా మృతుల సంఘం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో వారు ఏం జరిగిందని తెలుసుకునే లోపు బస్సుకు పూర్తిగా మంటలు కమ్మేశాయి. దీంతో వారు బస్సు నుంచి బయటపడే వీలు లేకపోవడంతో 17 మంది సజీవ దహనం అయ్యారు.