"కల్కి" విషయంలో ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదంట..!

MADDIBOINA AJAY KUMAR
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "కల్కి 2898 ఏడి" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దీపికా పదుకొనే , దేశా పటానీ , ప్రభాస్ కి జోడిగా కనిపించనుండగా ... లోక నాయకుడు కమల్ హాసన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక బిగ్ బి అమితా బచ్చన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని మొదట ఈ సంవత్సరం మే నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమాను ఆ తేదీన వాయిదా వేసి తాజాగా జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. గతంలో కల్కి సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ ఓ గెటప్ లో ఉండడం , తాజాగా ఈ మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో మరో గెటప్ లో ఉండడంతో ప్రభాస్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు అని అందుకే రెండు పోస్టర్ లలో రెండు డిఫరెంట్ లుక్స్ లో ఉన్నాడు అని ఓ వార్త వైరల్ అయింది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ సింగిల్ రోల్ లోనే కనిపించబోతున్నట్లు , పోస్టర్ లో రెండు డిఫరెంట్ లుక్ లలో కనిపించాడే కానీ సినిమాలో మాత్రం ఒకే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై ప్రస్తుతం వైరల్ అవుతున్న డ్యూయల్ రోల్ వార్తలు పూర్తిగా అవాస్తవం అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: