జగమంత జగన్:102 సీట్లతో ప్రభంజనం..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఓట్ల పండుగ నిన్నటి రోజున పూర్తి అయింది.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారుగా 6 లక్షల మంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వీరితో పాటు ఇతర దేశాల నుంచి కూడా చాలామంది పెద్ద ఎత్తున ఓటు వేయడానికి తరలి వచ్చినట్లుగా తెలుస్తోంది.. అలా ఓటు వినియోగించుకొని సాయంత్రానికి తిరుగు ప్రయాణం చేసిన వారు చాలామంది ఉన్నారు.. అయితే ఇలాంటి సమయంలోనే వైసీపీ పార్టీకి ఖచ్చితంగా 102 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ప్రకటించింది ప్రముఖ ఛానల్..

ఈ మేరకు ప్రముఖ ఛానల్ లో జర్నలిస్టు టీవీ -9 రజనీకాంత్ మాట్లాడుతూ.. వైసీపీ పార్టీకి 175 కాదు కానీ 102 సీట్లు ఇంచుమించుగా గెలిచే వాతావరణం ఎక్కువగా కనిపిస్తోందంటూ వెల్లడించింది.అందుకు కారణం ప్రతిపక్షం కూడా చాలా బలంగా పోరాడిందని నెగటివ్ ఓటు కూడా పెద్దగా ఎక్కడా కనిపించలేదు కానీ అర్బన్ లో మాత్రం ఇది కాస్త ఎక్కువగా కనిపించిందని తెలియజేశారు.. అయితే పేదలు మాత్రం 100% వైసీపీ పార్టీ వైపు మగ్గుచూపుతున్నారని పెత్తందారులు కూటమి వైపు ఎక్కువగా మద్దతు చూపారని తెలియజేశారు.

ప్రస్తుతం ఇది ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం మా అంచనా వేస్తున్నామంటూ ప్రముఖ టీవీ ఛానల్ తెలియజేసింది. దీంతో ఒక్కసారిగా ఎల్లో బ్యాచ్ చానల్స్ మీడియా వాళ్ళు సైతం ఏకంగా ఈ ఛానల్ పైన ట్రోల్ చేస్తున్నారు.. మరి చాలా మటుకు ఈసారి అధికారం వైసీపీ పార్టీనే అందుకుంటుందనే విధంగా తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు పూర్తిస్థాయిలో ఎవరు అధికారాన్ని చేపట్టారు అనే విషయం తెలియాలి అంటే వచ్చేనెల 4వ తేదీ వరకు ఆగాల్సిందే.. అటు కూటమి కూడా ఈసారి ఓటింగ్ ఎక్కువ పడింది కనుక మా పార్టీకే విజయం అంటూ ధీమాతో ఉంటున్నారు. సర్వేలు కూడా ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: