మలయాళ సినిమాలపై కన్ను వేసిన త్రిష.. ఏకంగా ఆ స్టార్ హీరోతో..!?

Anilkumar
1999లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది త్రిష. 2002లో హీరోయిన్గా తన కెరీర్ను ప్రారంభించింది. అలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి భారీ విజయాన్ని అందుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. అలా 22 ఏళ్ల తర్వాత కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఇక ఈ విషయంలో త్రిష సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలను అందుకుంటుంది త్రిష .తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు తెలుగు డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ప్రస్తుతం త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్

 ప్రారంభించింది. అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం హీరోయిన్ గా మంచి అవకాశాలను అందుకుంటుంది .భాషతో సంబంధం లేకుండా వరుసగా అన్ని సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఇప్పటికే తెలుగులో తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా త్రిష ఇప్పుడు బాలీవుడ్ కి కూడా ఎంట్రీస్తోంది. అటు హిందీ సినిమాలతో పాటు మలయాళ సినిమాల్లో నటించే అవకాశాలను కూడా అందుకుంటుంది. ఇక త్రిషకి ప్రస్తుతం 40 ఏళ్లు. 40 ఏళ్ల వయసులో కూడా త్రిష ఎన్ని భాషల్లో అవకాశాలు అందుకుంటుంది అంటే ఇది

 అంత తేలికైన విషయం కాదు. అది కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ రేంజ్ లో అవకాశాలు అందుకోవడంతో ఆమె అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ప్రస్తుతం త్రిష మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది. రామ్ అనే సినిమాలో మోహన్ లాల్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న త్రిష మరోవైపు టోవినో థామస్ హీరోగా నటిస్తున్న ఐడెంటిటీ సినిమాలో కూడా నటిస్తోంది. నిజానికి చాలా ఏళ్ల క్రితమే త్రిష మలయాళం లో నివిన్ పాలీ సరసన హే జూడ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంతగా ఆడక పోవడంతో ఆమెకి పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాలు హిట్ అయితే కచ్చితంగా త్రిషకి మలయాళం నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: