ఉచితాలను ఏపీ ప్రజలు ఇష్టపడుతున్నారా.. లేదా.. ఈ రిజల్ట్ తో తేలిపోనుందా..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఎన్నికలలో రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి రావడం కోసం ప్రజలకు ఎన్నో ఉచితలను అలవాటు చేస్తూ వచ్చారు. అందులో భాగంగా కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసం మీకు మేము పవర్ లోకి వస్తే అలాంటి ఉచితాలు ఇస్తాం అని ప్రకటించి వాటి ద్వారా లబ్ధి పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ పసుపు కుంకుమ అనే పథకం ద్వారా మహిళలకు సంవత్సరానికి ₹10,000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

దాని ద్వారా తమకు మంచి జరిగింది అని కూడా భావించారు. ఇక ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే పథకం ద్వారా మహిళలకు ఏటా 20 వేల నుండి 1 లక్ష రూపాయల వరకు లబ్ధి చేకూరే పథకాన్ని తీసుకువచ్చాడు. దీని ద్వారా మహిళలు తమ వైపు నిలిచారు అని జగన్ ప్రభుత్వం అనుకుంది. ఇక అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు అనేక ఉచితాలు మంచివి కావు, భారీగా ఉచితాలు ఇస్తే దేశం శ్రీలంక లా మారిపోతుంది అని అన్నాడు.

కానీ ఆ తర్వాత చంద్రబాబు కూడా కిందికి తగ్గి ఈ ఎలక్షన్ లలో మేము అధికారంలోకి వస్తే అనేక ఉచిత పథకాలను తీసుకురానున్నట్లు ప్రకటించారు. దానితో ఇలా ఉచితాలు ఇస్తే ఇప్పుడు శ్రీలంక అవుతుందా..? అని ప్రజలు అన్నారు. ఇకపోతే జగన్ మాత్రం ఈ సారి కాస్త అదుపులో ఉన్న ఉచితాలను మాత్రమే ప్రజలకు ఇవ్వనున్నట్లు మేనిఫెస్టో లో ప్రకటించాడు. కానీ కూటమి మాత్రం భారీ మొత్తంలో ఉచితాలను అధికారంలోకి వస్తే ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

మరి ఈ సారి కూటమి కనుక అధికారంలోకి వచ్చినట్లు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉచితాలను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు అర్థం అవుతుంది. అదే వైసీపీ కనుక అధికారంలోకి వచ్చినట్లు అయితే ఆంధ్ర ప్రజలు ఎక్కువగా ఉచితలను ఆశించడం లేదు అని అర్థం అవుతుంది. మరి ఈ సారి ఎన్నికలు దేనికి ప్రతిబింబంగా నిలుస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: