ముంబై ఇండియన్స్ కి కొత్త కెప్టెన్.. ఎవరో తెలుసా?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే ఒక టి20 టోర్నీని నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక సాదాసీదా టీ20 లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎంత మంచి గుర్తింపును సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ క్రికెట్లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా కొనసాగుతుంది. ఐపీఎల్ లో భాగమైతే భారీగా ఆదాయంతో పాటు.. ఇక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది.

 అందుకే విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ టోర్నీలో పాల్గొనడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే బిసిసిఐ ఎలా అయితే ఐపీఎల్ లాంటి టి20 టోర్నమెంట్ నిర్వహిస్తుందో ఇక మిగతా దేశాల క్రికెట్ బోర్డులు కూడా బీసీసీఐ బాటలోనే నడిచే ఐపీఎల్ తరహాలో తమ దేశంలో కూడా ఒక టి20 లీగ్ ను ప్రారంభించాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు సైతం సౌత్ ఆఫ్రికా t20 లీగ్ ప్రారంభించింది. అయితే ఈ లీక్ లో అటు ఐపీఎల్ లోని ఫ్రాంచైజీలే జట్లను కొనుగోలు చేశాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ లోని ముంబై ఇండియన్స్ అక్కడ ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ గా కొనసాగుతుంది.

 కాగా ఇటీవలే సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ కెప్టెన్గా కొత్త ఆటగాడు నియమితుడు అయ్యాడు. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ కి సారధ్య బాధ్యతలను  అప్పగించింది జట్టు యాజమాన్యం. జట్టు రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ అందుబాటులో లేకపోవడంతో ఆ ఫ్రాంచైజీ చివరికి పోలార్డ్ ను జడ్డు కెప్టెన్గా ఎంపిక చేసింది. అలాగే ఐఎల్ టి20లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ కు వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ ను సారథిగా నియమించింది. కాగా ఈ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా 5 t20 జట్లు ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: