పాట పాడి.. గిన్నిస్ బుక్ రికార్డు కొట్టింది?

praveen
సాధారణంగా ఈ భూమి మీద ఉండే మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొంతమంది పెద్ద స్టార్ హీరో కావాలని కోరుకుంటే.. ఇంకొంతమంది ఇక బిజినెస్ మ్యాన్ కావాలని అనుకుంటూ ఉంటారు.  మరి కొంతమంది ఒక మంచి ఉద్యోగం చేయాలని ఆశ పడుతూ ఉంటారు. ఇంకొంతమంది పాటలు పాడాలని మరి కొంతమంది డాన్సులతో గుర్తింపును సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కో మనిషికి ఒక్కో పిచ్చి ఉంటుంది. ఇక ఆ పిచ్చితోనే అనుకున్నది సాధిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే అచ్చం ఇలాగే కొంతమందికి ఏకంగా వరల్డ్ రికార్డులు కొల్లగొట్టాలనే పిచ్చి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలాంటి పిచ్చితో కొంతమంది ఏకంగా ప్రపంచ రికార్డు సాధించడం కోసం ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి విన్యాసాలు చేయడానికి కూడా రెడీ అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. కొంతమంది  ప్రతి ఒక్కరు చేసే పనిని  కొత్తగా ట్రై చేసి ప్రపంచ రికార్డును కొల్లగొడుతూ ఉంటారు. ఇక్కడ మనం మాట్లాడుకోబోయే యువతి కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా పాట పాడి గిన్నిస్ బుక్ రికార్డు కొట్టేసింది యువతి.

 అదేంటి పాట పాడితే గిన్నిస్ బుక్ రికార్డు వస్తుందా అలా అంటే ఎంతో మంది సింగర్స్ కి ఇప్పటికే రావాలి కదా అంటారా.. అయితే ఇక్కడ ఆ యువతి పాట పాడిన తీరు గురించి తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. భారత సంతతికి చెందిన సుచేత సతీష్ అనే 18 ఏళ్ల యువతి.  గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. దుబాయ్ లో 2023 నవంబర్ 24న జరిగిన కన్సల్ట్ ఫర్ క్లైమేట్ ప్రోగ్రాంలో 9 గంటల పాటు 140 భాషల్లో పాటలు పాడింది ఆమె. ఇక పూణేకు చెందిన మంజుశ్రీ వోక్ 121 భాషల్లో పాటలు పాడిన రికార్డును బ్రేక్ చేసింది. 2021లో 120 భాషలో పాటుపడిన సుచేత.. ప్రపంచ రికార్డు నమోదు చేయగా.. తాను 145 భాషల్లో పాటలు పాడగలను అంటూ చెప్పింది. అయితే ఆ కార్యక్రమానికి 140 మంది అతిథులు హాజరు కావడంతో ఇలా 140 భాషల్లోనే పాటలు పాడినట్లు చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: