నా కెరియర్ మొత్తంలో.. అతని బౌలింగ్ లో నేను భయపడ్డా : వార్నర్

praveen
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్  డేవిడ్ వార్నర్ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో అందరికీ సుపరిచితుడుగా మారి పోయాడు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఓపెనర్గా ఎదిగిన అతను ఇక ఎన్నోసార్లు జట్టును గెలిపించేందుకు మంచి ఆరంబాలు అందించాడు అని చెప్పాలి. అయితే బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా అటు భారత క్రికెట్ ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గర అయ్యాడు డేవిడ్ వార్నర్. అయితే వార్నర్ రిటైర్మెంట్ గురించి ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే.

 అయితే ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా వార్నర్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ తాను ఇంకా ఆడతాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.  అయితే ఇటీవలే పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కి ముందు తాను టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించ బోతున్నాను అంటూ ప్రకటించాడు. అయితే ఇక తన చివరి టేస్ట్ మ్యాచ్ పూర్తి కాకముందే ఇక వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు ఈ స్టార్ బ్యాట్స్మెన్. ఈ క్రమంలోనే ఇటీవల తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.

 మీ కెరీర్ మొత్తం లో ఎదుర్కొన్న కష్టమైన బౌలర్ ఎవరు అంటూ డేవిడ్ వార్నర్కు ప్రశ్న ఎదురయింది. ఇక ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు డేవిడ్ వార్నర్. 2016 - 17 సీసన్ లో పెర్త్ వేదికగా జరిగిన టెస్టు లో సౌత్ ఆఫ్రికా బౌలర్ స్టేయిన్ ను ఎలా ఎదుర్కోవాలో అని తనతో పాటు షాన్ మార్ష్ ఎంతగానో భయపడిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. ఫీల్డ్ లో ఉన్నప్పుడు స్టయిన్ కాస్తయినా నవ్వరూ. చాలా తీవ్రతతో పోటీ పడతాడు అంటూ వార్నర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: