మొదటి వన్డే ముందు.. టీమిండియాకు దెబ్బమీద దెబ్బ?

praveen
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్తో పాటు ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ కూడా ఆడబోతుంది టీమిండియా. ఈ క్రమంలోనే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ సహా పలువురు సీనియర్ క్రికెటర్ల కు అటు వెస్టిండీస్ పర్యటనకు విశ్రాంతిని ఇస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇక యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా బరిలోకి దిగేందుకు అవకాశం ఉంది అన్న విషయం తెలిసిందే. నేటి నుంచి మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.

 సాయంత్రం ఏడు గంటలకు ఇక ఈ వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే మొదటి వన్డే మ్యాచ్లలో విజయం సాధించి శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇలాంటి సమయంలో టీమిండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అనేది తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం గాయం బారినపడి ఇటీవలే సర్జరీ చేసుకొని మళ్ళీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు కేఎల్ రాహుల్. వెస్టిండీస్ పర్యటన లో టీమిండియా తో చేరేందుకు సిద్ధమయ్యాడూ. స్టార్ బ్యాట్స్మెన్ కె.ఎల్.రాహుల్ రాకతో అటు జట్టు పటిష్టంగా మారుతుందని అందరూ అనుకున్నారు.

 కానీ సరిగ్గా వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు అటు కె.ఎల్.రాహుల్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే ఇక జట్టుకు దూరమయ్యాడు. వెస్టిండీస్ పర్యటనలో జట్టుకు అందుబాటులోకి వస్తాడా లేదా అన్నది కూడా ప్రశ్నలగా మారింది.  ఇలాంటి సమయంలో టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇండియాలో కీలక ఆల్రౌండర్గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా కూడా నేడు జరగబోయే తొలి వన్డే మ్యాచ్ కు దూరం అయ్యాడు అన్నది తెలుస్తుంది.. మోకాలి గాయం తీవ్రం కావడంతో ఇక రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు  సమాచారం. అయితే తర్వాత పరిస్థితిని బట్టి రెండో వన్డే మ్యాచ్ ఆడించాలా లేకపోతే సిరీస్ మొత్తానికి విశ్రాంతి ఇవ్వాలా అన్నది తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: