కార్ కు సై - కైట్ కి నై - రేపెల్లుండి తెలంగాణాలో అనూహ్యమైన మార్పులు

తెలంగాణాలో ఎన్నికలు పూర్తైనా, ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం ముగిసినా, డిసెంబర్ 11 ఎన్నీకల పలితాలు ప్రకటించే వరకు, ఈ తిట్ల పండగ కొనసాగుతూనే ఉంది. అటు కెసీఅర్ కాని, ఇటు చంద్రబాబు కాని, ఆపై రాహుల్ కాని ఏమాత్రం వారి ఎన్నికల పలితాల గురించి ఎక్జిట్-పోల్స్ ప్రకటనల గురించి నోరెత్తట్లేదు. మిగిలిన వాళ్లంతా వాళ్ళ నోటికి ఏదోస్తే అది మాట్లా డేస్తూ మొత్తం రాజకీయవాతావరణాన్ని అయోమయంలో పడేస్తున్నారు.

 

ఎన్నికల ప్రచారంలో మొన్నటి వరకు పరస్పర ఆరోపణలు చేసుకున్న పార్టీలు, ఎగ్జిట్ పోల్స్ ప్రకటనల తర్వాత రూటు మారుస్తున్నాయి. అయితే కొన్ని పార్టీలు మాత్రం ఏవరూ అడగకుండానే పొత్తుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ విషయంలో "తెలంగాణ బీజేపీ" ముందుగానే ఎగ్జిట్-పోల్స్‌ లో ద్వారా అధికారం రాదని తేలిపోవడమే ఈ సంకేతాలకు కారణమని తెలుస్తోంది. ఏ పార్టీతోనైనా తాము పొత్తుకు సిద్ధమని సంకేతాలిస్తూనే మరికొన్ని షరతులను కూడా ప్రకటిస్తూ టీఆరెస్తో కలిసి కొత్త సర్కార్ ఏర్పాటుకు సిద్ధం  అంటూ - ఎంఐఎం తో పొత్తుకు సిద్ధం కాదని అంటోంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ అధక్షుడు రాహుల్ గాంధీ, టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి "బి-టీమ్" అని చేసిన  ఆరోపణలను నిజం చేసేలా సిద్దమౌతుంది.

 


పోలింగ్ రోజున అంటే 7 నవంబర్ సాయంత్రం విడుదలైన 10 నుండి 12 ఎగ్జిట్-పోల్స్‌ ప్రకటనల్లో అత్యధికుల అంచనాల ప్రకారం టీఆర్‌ఎస్‌ కు స్పష్టమైన ఆధిఖ్యత  ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాకూటమి గాని, బీజేపీకిగానీ ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సీట్లు రావనేది స్పష్టమవుతోంది. కొన్నిఎగ్జిట్-పోల్స్ బీజేపీకి 5 వరకు సీట్లు లభించవచ్చని తెలిపాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ "ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనన్ని స్థానాలు గెలుచుకోకపోతే, ఇతర పార్టీలతో పొత్తు విషయంపై చర్చిస్తామని - కాంగ్రెస్, ఎంఐఎం మినహా ఏ పార్టీతో నైనా తాము పొత్తుకు సిద్ధమని తాము తప్పకుండా అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉంది అని తెలిపారు.

 

దీనిపై టీఆర్ఎస్ అధికార ప్రతినిధి భాను ప్రసాద్ స్పందిస్తూ, "టీఆర్ఎస్‌ ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం ఉండదు. సొంత మెజారిటీ తోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధిస్తామనే నమ్మకం మాకుంది" అని తెలిపారు. ఎగ్జిట్-పోల్స్ ప్రకారం, బీజేపీ కంటే ఎంఐఎం పార్టీకే ఎక్కువ సీట్లు లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ వైపు కాకుండా ఎంఐఎం వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. పైగా, అధినేత కేసీఆర్, కాంగ్రెస్ యేతర, బీజేపీ యేతర నూతన కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో బీజేపీతో గాని కాంగ్రెస్ తో గాని పొత్తు పెట్టుకోనే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే, ఇవి రాజకీయాలు అందునా ఏ సిద్ధాంతమూ, విధానము లేని రోజులు ఆఖరిక్షణంలో ఏమైనా జరగొచ్చు. విజయం ప్రజాకూటమిదా? టీఆర్ఎస్‌ దా? ఈ రెండూ కాకుండా హంగ్ ఏర్పడుతుందా? ఇదంతా తెలియాలంటే తెలియాలంటే డిసెంబరు 11వరకు నిరీక్షించాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: