మోడీకి తిరుపతి ఎఫెక్ట్ !

KSK
మోడీ ప్రధాని అయ్యాక దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షచూపుతున్నారు అని ఇప్పటికే దక్షిణాది ప్రాంతానికి చెందిన పాలకుల మనసులలో నాటుకుపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల మోడీ గత నాలుగు సంవత్సరాలుగా కనబరిచిన వైఖరి రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్య మనిషికి అసహనం తెప్పించింది. అన్యాయంగా విభజనకు గురై నష్టపోయిన ఆంధ్రరాష్ట్రాన్ని మోడీ ప్రధాని మంత్రి అయ్యాక మరింత నష్టపరిచాడు అని చాలామంది అంటున్నారు. విభజన నేపథ్యంలో పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రరాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో మోడీ చేసిన మోసం రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువతకు ఎంతగానో ఆగ్రహం తెప్పించాయి.

అయితే ఈ క్రమంలో తాజాగా మోడి ఆంధ్రరాష్ట్రానికి తలమానిక గా వుండే తిరుమల తిరుపతి పై కన్ను పడింది. తిరుపతిని కేంద్రం పరిధిలోకి తీసుకురావడానికి మోడీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తిరుపతి ఆలయంలో ఏవేవో మార్పులు చేస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కేంద్ర పురావస్తుశాఖ ఆలయాన్ని ఒకసారి పరిశీలిస్తోందని టిటిడి బోర్డు కి లేఖ అందజేశారు. తిరుమలలో ఉన్న ఆలయాలను, వాటి చరిత్రను పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ వాటిని పూర్వకాలంలో నిర్మించినవిగా గుర్తించింది.

అయితే ఇదంతా గమనించిన రాష్ట్రానికి చెందిన కొంతమంది రాజకీయ పెద్దలు ఇది కేంద్రం తిరుపతి పై  చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు. తిరుమలలోని ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆ ఆలయాలపై ఎలాంటి అధికారం ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కేంద్రం తమ పరిధిలోకి తీసుకోడానికి ఈ ప్రయత్నాలు అని అంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఏమనుకున్నాధో ఏమో తెలియదు గాని తిరుపతికి కేంద్రానికి ఏమీ సంబంధం లేదు...అది ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఆలయం దాని మీద కేంద్రానికి ఎటువంటి హక్కులు లేవని కొద్ది గంటలలోనే ప్రకటన చేసింది.

ఇదే విషయాన్ని టిటిడి ఉన్నతాధికారి తెలియజేశారు...టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ వివరణ ఇచ్చారు. గత అధికారులు రాసిన ఉత్తరం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. గతంలో కేంద్ర ఆర్కియాలజీ పరిధిలోకి టీటీడీ ఆలయాలను ఇచ్చే ఆలోచన చేసినా.. ఆ తరువాత దానిని విరమించుకున్నట్టు రికార్డుల్లో ఉందని తెలిపారు. దీని ప్రకారం.. పురావస్తు శాఖకు టీటీడీ ఆలయాలను ఇచ్చే ప్రసక్తే లేదని సింఘాల్ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: