పిన్నెల్లి: ఎన్నికల ఫలితాల వేళ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్..

Divya
గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ఓటింగ్ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎంలను ధ్వంసం చేయడం హత్యాయత్నం అల్లర్ల దాడులు బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు మారు మోగింది. ఆ తర్వాత కొద్ది రోజులు దాక్కొని గత నెల 23వ తేదీన  హైకోర్టుకు వెళ్లి అరెస్టు కాకుండా ఉత్తర్వులను కూడా తీసుకువచ్చారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన లాయర్ తో చేరుకొని హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి సంతకం చేయవలసి ఉంటుందంటూ కోర్టు కూడా ఉత్తర్వులను జారీ చేసింది.

రేపటి రోజున ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పల్నాడు  జిల్లాలో ఇప్పటికే భారీగానే బందోబస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపటి రోజున కౌంటింగ్ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణకు సుప్రీంకోర్టు ఒక ఎదురుదెబ్బ వేసింది. అదేమిటంటే టిడిపి ఏజెంట్ నంబూరు శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్ వల్ల కోర్టు విచారించిన తర్వాత. పిన్నెల్లి పైన ఆంక్షలు కూడా విధించడం జరిగింది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ సెంటర్ వద్దకు తను వెళ్లకూడదని కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాలలో కూడా వెళ్లకూడదని కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.

అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈనెల 6వ తేదీ వరకు అరెస్టు చేయకూడదు అంటూ కూడా కోర్టు ఉత్తర్వులను తప్పు పట్టడం జరిగింది సుప్రీంకోర్టు.. పాల్వాయి గేటు పోలింగ్ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు సుప్రీంకోర్టులో సైతం ఇందుకు సంబంధించి ఫికేషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. పిన్నెల్ని అరెస్టుకు హైకోర్టు ఇచ్చిన వెలుసుబాటు ఎత్తివేయాలంటూ కూడా శేషగిరిరావు తన పిటీషన్లు తెలియజేసినట్లు తెలుస్తోంది.. అలాగే ఈవీఎంల ధ్వంసంతో పాటు హత్యాయత ప్రయత్నం చేశారని ప్రధానంగా ఆయన ఆరోపించడం జరిగింది. ఇలాంటి సమయంలోనే పిన్నెల్లి ఓటింగ్ పరిసర ప్రాంతాలలో ఉండకూడదని కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: