కానీ ఈ
సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడం , పవన్ రాజకీయ పనులతో బిజీగా ఉండడంతో ఈ
మూవీ కి సంబంధించిన అన్ని పనులు
సెప్టెంబర్ 27 వ తేదీ వరకు పూర్తి కావడం కష్టమే అని తెలుస్తోంది. దానితో ఈ తేదీ పై చాలా మంది కన్ను పడింది. అందులో భాగంగా ఇప్పటికే లక్కీ
భాస్కర్ మూవీ ని ఈ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే మరో బడా
మూవీ కూడా ఈ తేదీ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ హీరో గా జాన్వీ కపూర్
హీరోయిన్ గా
కొరటాల శివ దర్శకత్వంలో దేవర
మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని
అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక ఈ
సినిమా మొదటి భాగం పనులు
అక్టోబర్ 10 వ తేదీ కంటే చాలా రోజులు ముందే పూర్తి కానున్న నేపథ్యంలో ఈ
మూవీ ని
సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయాలి అని మేకర్స్ అనుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ ఇదే వార్త నిజం అయినట్లు అయితే అనుకున్న తేదీ కంటే దేవర ముందే విడుదల అవుతున్నందుకు
ఎన్టీఆర్ ఫ్యాన్స్
ఖుషి అవుతారు. ఇక ఓజి
మూవీ విడుదల ఉంటుంది అనుకున్న విడుదల కాకపోవడంతో పవన్ అభిమానులు కాస్త బాధపడాల్సి ఉంటుంది.