ఏంటి.. కృతి శెట్టి కి పెళ్లి కాకుండానే ఒక కొడుకు ఉన్నాడా..!?

Anilkumar
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. ఆ తర్వాత తనకి వరుస సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అలా శ్యాం సింగరాయ్ బంగార్రాజు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ది వారియర్ మాచర్ల నియోజకవర్గం కస్టడీ వంటి అన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలతో మంచి హిట్ కొట్టింది. అయితే కేవలం సినిమాలతోనే కాకుండా ఇటు సోషల్ మీడియాతో కూడా ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శర్వానంద్

 తో కలిసి మనమే అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఒక సరికొత్త పాత్రలో అలరించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇందులో ఆమె ఒక ప్రేయసిగా పెళ్లయిన ఆమెలాగా ఒక పిల్లాడికి తల్లి లాగా కనిపించబోతుంది అని అంటున్నారు. అంతేకాదు  సినిమా మొత్తం కూడా ఒక కొత్తజంట మధ్య ప్రేమ అనుబంధాలు గొడవలు ఎమోషన్స్ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్ల గురించి ఉంటుంది అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అంతేకాదు సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోయినప్పటికీ

 చాలా సింపుల్ అండ్ నీట్ గా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే చాలా తక్కువ సమయంలోనే భారీగా గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది ఇప్పుడు వెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది అని అంటున్నారు. అదేంటి పెళ్లి కాకుండా తల్లి కావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా... అదేనండి మనమే సినిమాలో తన క్యారెక్టర్ అలా ఉంటుందట. ఈ సినిమాలో సుభద్ర అనే పాత్రలో కనిపించబోతోంది కృతి. అయితే ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కృతి శెట్టి కి ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా ఉప్పెన స్థాయిలో హిట్ టచ్ చేయలేకపోయింది. మరి మనమే సినిమాతో అయినా ఆ రేంజ్ లో హిట్ సాధిస్తుందా లేదా అన్నది తెలియాలి అంటే సినిమా వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: