తల్లి కోసం అంతకు తెగించిన శ్రీ లీల..!?

Anilkumar
యంగ్ బ్యూటీ శ్రీ లీల కి సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వినబడుతూనే ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు శ్రీ లీల తన పేరు మార్చుకోబోతుందా అంటే అవును అనే సమాధానమే వినబడుతుంది. ఎందుకు ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న శ్రీ లీల ఇప్పుడు స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. మొదటి సినిమాతోనే భారీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ధమాకా సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత

 వరుసగా స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. అలా ఈమె చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా విజయాలను అందుకున్నాయి. దాంతో ఇప్పుడు క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈమె పేరు మార్చుకోబోతోంది అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఆమె తల్లి తన పేరు మీద జాతకం చూపించిందట. అందులో భాగంగానే పంతులు సలహా మేరకు తన పేరులోని అక్షరాలను మార్చి ఏదైనా కొత్త పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పారట. తన పేరులోనీ

 EE తీసేసి I ఒక్కటే పెట్టుకోమన్నారట. అలా మార్చుకుంటే తనకి రాబోయే రోజుల్లో బావుంటుంది అని చెప్పారట. ఈ నేపథ్యంలోనే తన తల్లి కోరిక మేరకు శ్రీ లీల తనకి ఇష్టం లేకపోయినప్పటికీ తన పేరుని మార్చుకోవడానికి సిద్ధమైనట్లుగా సమాచారం వినబడుతోంది. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇంత చదువుకున్న ఈ బ్యూటీ   జాతకాలను నమ్మి పేరు మార్చుకోవడం ఏంటి అని ఈ వార్త తెలిసిన తర్వాత చాలామంది కామెంట్లు చేశారు. అంతేకాదు సినిమా అవకాశాల కోసమే శ్రీ లీలా ఇలా చేసింది అంటూ కొందరు నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ధమాకా చేసిన తర్వాత స్త్రీల చేసిన చాలా సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. అందుకే శ్రీల తన పేరుని మార్చుకోబోతోంది అని వినికిడి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: