టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్‌‌కు కీలక పదవి.. ?

Veldandi Saikiran
జూనియర్ ఎన్టీఆర్.... ఇండస్ట్రీలో స్టార్ హీరో. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన అరుదైన హీరో జూనియర్ ఎన్టీఆర్. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని... ఇండస్ట్రీలు అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కుటుంబ పేరును వాడుకున్న సరే... ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసి.... కుటుంబానికి మంచి పేరు తెచ్చాడు.

 
 అయితే సినిమాలలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్... ఏపీ రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్ వస్తుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీలోని కొంతమంది లీడర్లు... జూనియర్ ఎన్టీఆర్ ను  ఏపీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. వారి తాతగారు పెట్టిన తెలుగుదేశం పార్టీని... నడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 2019 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది.

 
 అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు... అరెస్టు అయినప్పుడు... ఆ పార్టీ అతలాకుతలమైంది. అలాంటి సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ను రావాలని చాలామంది కోరారు. కానీ ఇప్పటివరకు ఏపీ రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ అంటే పట్టనట్టే ఉంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్  ను రాజకీయాల్లోకి రాకుండా... చంద్రబాబు నాయుడు కుటుంబం తొక్కేస్తుందని కొంతమంది వైసీపీ నేతలు అంటున్నారు.

 
 అయితే తాజాగా ఓ టీవీ డిబేట్లో దీనిపైన చర్చ జరిగింది. ఈ అంశంపై పిఠాపురం  టిడిపి సీనియర్ నేత వర్మ  హాట్ కామెంట్ చేశారు. సినిమాలు మానేసి పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్... రాజకీయాల్లోకి రావాలని ఆయన కోరారు. ఆయన పార్టీ కోసం పని చేస్తే... మంచి ఫలితాలు వచ్చిన తర్వాత కచ్చితంగా కీలక పదవి ఇస్తామని తెలిపారు. కానీ భయపడి ఇంట్లో కూర్చుంటే ఏ పదవులు రావని... జూనియర్ ఎన్టీఆర్కు చురకలు అంటించారు టిడిపి నేత వర్మ. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ను అలా ఎందుకు అంటావు... వాళ్ల తాత పెట్టిన భిక్షతో... చంద్రబాబు నాయుడు కుటుంబం బతికేస్తుందని మండిపడుతున్నారు. మీరు పదవులు ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: