ఏపీ ఎన్నికలపై ఆ సర్వే 100 శాతం ఖచ్చిమన్న ఆర్జీవీ.. వివరాలివే

Suma Kallamadi
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక కాలంలో జరిగాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. టీడీపీ కూటమికి అనుకూలంగా కొన్ని, వైసీపీకి అనుకూలంగా మరికొన్ని సర్వే ఫలితాలు వచ్చాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవాలు వెల్లడించాయా, ప్రజల నాడిని పట్టాయా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అనుకూలంతా ఫలితాలను ఇచ్చాయి.

 వాటికి విశ్వసనీయత లేదని వైసీపీ ఆ సర్వే ఫలితాలను తిరస్కరించింది. ఈ తరుణంలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఫలితాలపై ఆయన కూడా తన అభిప్రాయం చెప్పారు. తాను పేర్కొన్న సర్వే ఖచ్చితంగా 100 శాతం జరుగుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఎప్పటికప్పుడు రాజకీయాల్లో తన సొంత అభిప్రాయాలు, కామెంట్లతో కాక పుట్టించే ఆర్జీవీ నుంచి ట్వీట్ రావడంతో అంతా ఆసక్తిగా దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్‌పై చాలా మంది ఆసక్తి చూపుతారు. కొన్ని సార్లు ఆయన వేసే సెటైర్లు టీడీపీ, జనసేన అభిమానుల ఆగ్రహానికి గురవుతాయి. అయితే ఆర్జీవీ మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోడు. తనదైన శైలిలో ఎప్పటికప్పుడు ఆయన తన సొంత అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతుంటారు.

 తాజాగా ఆర్జీవీ నుంచి ఓ ఆసక్తికర ట్వీట్ వచ్చింది. ట్విట్టర్‌లో సిరాశ్రీ అనే యూజర్ ఓ ట్వీట్ చేశారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై తాను ఎగ్జిట్ పోల్ అంటూ సిరాశ్రీ నుంచి ఆ ట్వీట్ వచ్చింది. ఏపీలో 175 సీట్లు ఉన్నాయని, టీడీపీ కూటమి లేదా వైసీపీ 0 నుంచి 175 వరకు ఎంతైనా గెలుచుకోవచ్చని పేర్కొన్నారు. లోక్ సభ సీట్ల విషయంలో 0 నుంచి 25 వరకు ఎవరైనా గెలుచుకోవచ్చని చెప్పారు. ఏ సర్వే అయినా తన అంచనాలను తప్పుతుందేమో కానీ, తన అంచనా ఖచ్చితత్వమని కితాబిచ్చారు. ఈ ట్వీట్‌ను ఆర్జీవీ రీ ట్వీట్ చేశారు. తాను చూసిన వాటిలో ఇదే అత్యంత ఖచ్చితమైన సర్వేగా పేర్కొన్నారు. వంద శాతం అందరూ నమ్మదగిన సర్వే ఇదే అని ట్వీట్‌లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ చేసిన సర్వే నవ్వులు పూయిస్తోంది. కొన్ని సర్వే సంస్థల నుంచి వెలువడిన ఫలితాలపై ఇది సెటైరికల్ అని కామెంట్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV

సంబంధిత వార్తలు: