బాబు గేమ్...టీడీపీ 120 కొట్టడం ఖాయం ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. కొన్ని సర్వేలు వైసిపికి పార్టీ తెలుస్తుందని.. మరి కొన్ని సర్వే సంస్థ లేమో తెలుగుదేశం కూటమి గెలుస్తుందని స్పష్టం చేశాయి. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఏ సర్వే సంస్థను నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
 
 నేషనల్ సర్వేలు మాత్రం ఎక్కువ శాతం తెలుగుదేశం కూటమి గెలుస్తుందని స్పష్టం చేశాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో సరైన ఫలితాలను వెల్లడించిన ఇండియా టుడే సర్వే సంస్థ.... ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ ఫలితాలను రిలీజ్ చేసింది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా లెక్కల ప్రకారం... తెలుగుదేశం కూటమి 120 సీట్లతో అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టం చేసింది.
 
 తెలుగుదేశం పార్టీ కూటమికి... ఏకంగా 51 శాతం ఓట్ షేరింగ్ ఉంటుందట. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీకి 78 నుంచి 96 స్థానాలు వస్తాయని వెల్లడించింది ఈ సర్వే సంస్థ. బిజెపి పార్టీకి నాలుగు నుంచి ఆరు ఎమ్మెల్యేలు వస్తాయట. ఇది జనసేనకు 16 నుంచి 18 సీట్లు వస్తాయని... మొత్తంగా 120 స్థానాలతో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతున్నట్లు తెలిపింది. ఇటు వైసిపి పార్టీకి 55 నుంచి 77 స్థానాలు వస్తాయట.
 
 ఎన్నికల కంటే ఒక పది రోజులు ముందు... ల్యాండ్ టైటిలింగ్  వైఫల్యాలను జనా ల్లోకి తీసుకుపోవడంలో కూటమి సక్సెస్ అయిందట. అందుకే తెలుగుదేశం కూటమికి... చివర్లో మంచి ఫలితాలు వచ్చాయని ఈ సర్వే సంస్థ వెల్ల డించింది. అంతేకాకుండా...  నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ, మూడు రాజధానుల అంశాన్ని కూడా... తెలుగుదేశం కూటమి బాగా వాడుకుందని ఈ సర్వే సం స్థ తెలిపింది. ఈ అంశాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుందని... తెలుగుదేశం కూటమి గెలుస్తుందని ఇండియా టుడే సర్వే సంస్థ వెల్ల డించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: