రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఈ రోజు అనగా జనవరి 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను నిన్న రాత్రి మూవీ బృందం వారు చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో ల బుకింగ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందే చాలా ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓపెన్ అవుతాయి అని ప్రభాస్ అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో బుకింగ్స్ తెలంగాణ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓపెన్ అయిన తర్వాత చాలా సమయం గడిచిన కూడా ఓపెన్ కాలేదు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభిస్తే ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో బుకింగ్స్ తెలంగాణ రాష్ట్రంలో 11 గంటలకు ఓపెన్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ప్రదర్శించలేదు. కేవలం హైదరాబాద్ నగరంలో కొన్ని థియేటర్లలో మాత్రమే రాజా సాబ్ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను మూవీ బృందం వారు ప్రదర్శించారు. ఇకపోతే ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు విడుదల చేస్తున్నారు.
మైత్రి సంస్థ వారు ఈ సినిమా విడుదలను నైజాం ఏరియాలో సరిగ్గా చేయలేదు అని నైజం ఏరియాలో గనుక పెద్ద స్థాయిలో రాజా సాబ్ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను ప్రదర్శించినట్లయితే ఈ మూవీ కి నైజాం ఏరియాలో ప్రీమియర్ షో ల ద్వారానే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వచ్చేవి అని ఇప్పుడు నైజాం ఏరియాలో ఈ సినిమాకు ప్రీమియర్ షో ల ద్వారా చాలా తక్కువ కలెక్షన్స్ వస్తాయి అని దానికి ప్రధాన కారణం మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారు అని ప్రభాస్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నిధి అగర్వాల్ , మాలవిక మోహన్ , రీద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించారు.