మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్: పవర్ ఫుల్ యాక్షన్ తో సమంత ఈజ్ బ్యాక్..!

Pandrala Sravanthi
సమంత నటించిన తాజా లేడి ఓరియెంటెడ్ మూవీ మా ఇంటి బంగారం.. పెళ్లి తర్వాత సమంత నుండి వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సమంత అభిమానులని తెగ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా జనవరి 9న ఈ సినిమాకి సంబంధించి టీజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇక కట్ చేస్తే మా ఇంటి బంగారం మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ స్టార్టింగ్ లోనే సమంత తన భర్త పాత్రలో నటించిన గుల్షన్ దేవయ్యతో కలిసి బస్సు దిగుతుంది. ఎట్లా ఇక్కడి వరకు వచ్చినాము కదా.. ఇంటి వరకు వెళ్దాం అని సమంత అంటే.. అత్తగారిల్లు కాస్త ఆలోచించు అని గుల్షన్ దేవయ్య అంటారు. 


అయితే ఈ డైలాగులో సమంత యాస అందరిని ఆకట్టుకుంటుంది. సమంత అత్తారింట్లోకి అడుగుపెట్టగానే వారందరిని చూసి అందరూ ఎంతో మంచిగున్నారు.చూస్తూ ఉంటే ఎప్పటినుండో తెలిసినట్లు ఉంది అని వారందరిని చూసి సమంత అనుకుంటుంది. వారం రోజుల్లో వారందరితో ఫుల్ గా కలిసిపోతాను అని చెబుతుంది. అంత ఫీల్ అవ్వద్దు ఫుల్ ఎంక్వయిరీ కమిషన్ ముందు ఉంటుంది అని భర్త పాత్రలో వార్నింగ్ ఇచ్చినట్టు చెబుతారు. ఆ తర్వాత నుండి సమంత పై మాటల అటాక్ మొదలవుతుంది. వాడికి లక్షణమైన అమ్మాయిని చూద్దామనుకున్నా.. మన రాత అంటూ బామ్మ డైలాగ్ చెబుతుంది. ఆ తర్వాత సమంత యాక్షన్ మోడ్లో కనిపిస్తుంది.పవర్ఫుల్ ఫైటింగ్ లు చేస్తూ కనిపిస్తుంది.ఇక సమంత ప్రవర్తన చూసి వీడు ఎలా ఉంటున్నాడో దీనితో.. ఎక్కడినుండి పట్టుకొచ్చాడో అంటూ కుటుంబం లోని వాళ్ళు మాట్లాడుకుంటారు. 


అలా మొత్తంగా సమంతని అమాయకురాలు అని మొదట అనుకుంటారు. కానీ ఆ తర్వాతే సమంత లోని యాక్షన్ మోడ్ మొత్తం బయటికి వస్తుంది.. అదంతా చూసి కుటుంబం షాక్ అవుతుంది. ఇక తాజాగా విడుదలైన మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్ కు సంబంధించిన ఈ వీడియో సమంత అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ టీజర్ ట్రైలర్ లోని బ్యాగ్రౌండ్ బిజిఎం అద్భుతంగా ఉంది. అలా మొత్తంగా సమంత అభిమానులకి ఈ సినిమా ద్వారా ఫుల్ మీల్స్ అందుతాయని వీడియో చూసిన నెటిజన్స్ రివ్యూ ఇస్తున్నారు. ఇక ఈ మూవీ సమంత సొంత బ్యానర్ అయినటువంటి ట్రాలాల పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కగా.. ఈ మూవీకి నిర్మాతగా సమంత భర్త రాజ్ నిడిమోరు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి నందిని రెడ్డి డైరెక్షన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: