రాజా సాబ్ వరల్డ్ వైడ్ గా అన్ని థియేటర్లలో.. ఓపెనింగ్స్ అదిరిపోయేలా ఉన్నాయిగా..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... నిధి అగర్వాల్ , రీద్ధి కుమార్ , మాలవికా మోహన్ ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించారు. ఈ సినిమాను ఈ రోజు అనగా జనవరి 9 వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను నిన్న అనగా జనవరి 8 వ తేదీన చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో విడుదల కాబోతుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమా దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 900 కు పైగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక , తమిళ్ మిగిలిన సౌత్ ప్రాంతాలలో కలిపి ఈ సినిమా 500 వరకు థియేటర్స్ లలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. నార్త్ ఇండియాలో ఈ మూవీ దాదాపు 1000 థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3000 వేలకు పైగా స్క్రీన్ లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుండడంతో ఈ సినిమాకు గనుక మంచి టాక్ మొదటి రోజు వచ్చినట్లయితే ఈ మూవీ భారీ ఓపెనింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టడం ఖాయం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: