వేణు స్వామి 2026 ప్రిడిక్షన్స్: లోకేష్‌కు ప్రమోషన్.. పవన్‌కు మళ్ళీ నిరాశేనా?
లోకేష్ వ్యక్తిగత జాతకంలో గ్రహ గతులు ఆయనకు అనుకూలంగా మారుతున్నాయని, పాలనలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని వేణు స్వామి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్! ఇక జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నా, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే యోగం ప్రస్తుతానికి లేదని ఆయన స్పష్టం చేశారు. 2026లో కూడా పవన్ కింగ్ మేకర్‌గానే ఉంటారని తప్ప, కింగ్ అయ్యే ఛాన్స్ లేదని ఆయన చెప్పడం జనసైనికులకు మింగుడుపడటం లేదు. పవన్ జాతకంలో రాజయోగం ఉన్నప్పటికీ, అది కేబినెట్ స్థాయి వరకే పరిమితం అవుతుందని ఆయన విశ్లేషించారు.
జగన్ పరిస్థితి ఏంటి? మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి చెబుతూ.. ఆయనకు గడ్డు కాలం ఇంకా ముగియలేదని వేణు స్వామి అభిప్రాయపడ్డారు. 2026 వరకు జగన్ చుట్టూ కోర్టు కేసులు, రాజకీయ ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయని, పార్టీని కాపాడుకోవడం ఆయనకు పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. వేణు స్వామి జోస్యం గతంలో కొన్నిసార్లు నిజమైతే, మరికొన్ని సార్లు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మరి 2026 గురించి ఆయన చెప్పిన ఈ సంచలన విషయాలు ఏ మేరకు నిజమవుతాయో వేచి చూడాలి. ఏది ఏమైనా, లోకేష్‌కు పట్టాభిషేకం, పవన్‌కు నిరాశ అనే పాయింట్స్ మాత్రం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.