నైజాం ఏరియా ఆడియన్స్ కు అలాంటి షాక్ ఇచ్చిన రాజా సబ్ డిస్ట్రిబ్యూటర్స్..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం వరకు దాదాపు తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదల అయినా కూడా వాటికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఆ మూవీ విడుదలకు కొన్ని రోజుల ముందే మూవీ బృందం వారు ఓపెన్ చేసేవారు. దానితో సినిమాను చూడాలి అని ఆసక్తి ఉన్నవారు పక్కాగా ప్లాన్ చేసుకొని ఏ థియేటర్లో ఏ టైమ్ కి సినిమా చూడాలి అనే విధంగా టికెట్లు బుక్ చేసుకునేవారు. ఇకపోతే ప్రస్తుతం దాదాపు పరిస్థితులు చాలా వరకు మారాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాల టికెట్ హైక్స్ కోసం మూవీ నిర్మాతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉండడం , ఆ టికెట్ హైక్స్ జిఓ సినిమా విడుదలకు దాదాపు ఒక రోజు , రెండు రోజుల ముందు రావడం , ఆ తర్వాత థియేటర్స్ , వాటి రేట్లు ఓకే చేసుకుని అవి ఆన్లైన్ లో ఓపెన్ అయ్యే సరికి చాలా సమయం దాటిపోతుంది. దానితో సినిమా విడుదల సమయం అత్యంత దగ్గర పడిన సమయంలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇకపోతే ప్రభాస్ హీరోగా రూపొందిన రాజా సాబ్ మూవీ విషయంలో నైజాం ఏరియాలో మాత్రం ఘోరమైన పరిస్థితులు ఎదురయ్యాయి.


ఈ సినిమా ఈ రోజు అనగా జనవరి 9 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను నిన్న రాత్రి ప్రదర్శించారు. దానితో నైజాం ఏరియా ఆడియన్స్ ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ సినిమా ప్రీమియర్ షో మరియు రెగ్యులర్ షో లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని నైజాం ఏరియా ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఇక మూవీ ప్రీమియర్ షో లో నైజాం ఏరియాలో 11 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అయితే ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో బుకింగ్స్ ను 11 గంటలకు ఓపెన్ చేశారు. ఈ మూవీ ని నైజాం ఏరియాలో మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు విడుదల చేస్తున్నారు. దానితో ప్రభాస్ అభిమానులు మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థపై తీవ్ర నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: