స్పిరిట్:డైరెక్టర్ కి ప్రామిస్ చేసిన ప్రభాస్..రూట్ మార్చుకున్నట్టేనా..?

Divya
హీరో ప్రభాస్ ప్రస్తుతం తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. ఈ రోజున (జనవరి 9) రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాకుతో ఆకట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినప్పటికీ డైరెక్టర్ మారుతి వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోందని అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, నాగ్ అశ్విన్ తో కల్కి 2, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, డైరెక్టర్ హనురాఘవపూడితో ఫౌజి చిత్రాలలో నటిస్తున్నారు.


రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కలిసి ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రభాస్ తన వ్యక్తిగత అలవాట్లు సినిమా విడుదల సమయంలో తన ఫీలింగ్స్ గురించి మాట్లాడారు. వేలాది మంది అభిమానులు ప్రభాస్ సినిమా వస్తోందంటే చాలు మొదటి రోజు థియేటర్ల వద్ద చాలా హంగామా చేస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం తన చిత్రాలను మొదటి రోజే థియేటర్లలో చూడనని  చెప్పడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.


ప్రభాస్ ఇప్పటివరకు తన కెరియర్లో ఏ సినిమాను కూడా ఫస్ట్ డే థియేటర్లలో చూడలేదని , విడుదలైన వారం రోజుల తర్వాత థియేటర్లలో రద్దీ తగ్గిన తర్వాతే చాలా ప్రశాంతంగా చూస్తానంటూ తెలిపారు.. ఈ విషయం విన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఆశ్చర్యపోతూ, ఈ విషయం పైన ఒక గట్టి కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. రాజాసాబ్ సినిమా వరకు ఓకే కానీ స్పిరిట్ సినిమాకు మాత్రం మీరు కచ్చితంగా మొదటి రోజు థియేటర్లలో చూడాలని కోరగా అందుకు నవ్వుతూ సమాధానాన్ని చెబుతూ స్పిరిట్  సినిమా విషయంలో అలవాటును మార్చుకుంటానని మొదటి రోజే సినిమా చూస్తానంటూ ప్రామిస్ చేశారు ప్రభాస్. ఇప్పటికే స్పిరిట్ సినిమా విషయంలో అప్డేట్లను విడుదల చేస్తూ ఉన్నారు.  ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: